»   » టెస్ట్ చేస్తున్నారు: రామ్ చరణ్‌కు ‘ధృవ’ సెట్టయిందా?

టెస్ట్ చేస్తున్నారు: రామ్ చరణ్‌కు ‘ధృవ’ సెట్టయిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ ఖరారు చేసే ముందు... తమ మైండ్ లో ఉన్న టైటిల్స్ అనఫిషియల్ గా జనాల్లోకి వదులుతున్నారు దర్శక నిర్మాతలు. ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే అదే టైటిల్ ఓకే చేస్తున్నారు, నెగెటివ్రె స్పాన్స్ వస్తే మరో టైటిల్ పరిశీలిస్తున్నారు.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి డేట్ ఖరారైంది

రామ్ చరణ్ తాజా సినిమా విషయంలో ప్రస్తుతం అదే జరుగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళంలో హిట్టయిన ‘థాని ఒరువన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ‘రక్షక్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనికిపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో....ఈ చిత్రానికి ప్రస్తుతం ‘ధృవ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ విషయాన్ని పిఆర్ఓ బిఏ రాజాు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాదాపు ఇదే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉంది. మీకు ఈ టైటిల్ నచ్చితే ... కామెంట్ బాక్సులో మీ అభిప్రాయం తెలియజేయండి. 

 Ram Charan next film title Dhruva!

ఈ నెల 18 నుండి సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పక్కా ప్లానింగుతో షెడ్యూల్ తయారు చేసినట్లు తెలుస్తోంది. జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాని ఒరువన్' చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి హైలెట్ అయ్యాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. రామ్ చరణ్ ఈ మూవీలో పోలీస్ పాత్రలో నటించబోతున్నాడు. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా అరవింద స్వామి క్రిమినల్ పాత్రలో నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ రోయిన్ గా ఓకే అయినట్లు తెలుస్తోంది.

English summary
Ram Charan's next film is all set to hit the floors from 18th of this month. It is a remake of Tamil blockbuster Thani Oruvan. As per sources Dhruva is the title under consideration for this film. Surender Reddy is the director and Rakul Preeth Singh is the heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu