»   » రామ్ చరణ్ మూవీ రిలీజ్ డేట్ ఇచ్చారు

రామ్ చరణ్ మూవీ రిలీజ్ డేట్ ఇచ్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో మాదిరి టాలీవుడ్లో కూడా సినిమా షూటింగులు, రిలీజ్ లు క్రమ శిక్షణగా.... పక్కా టైమింగుతో చేసే సంస్కృతి మొదలైంది. ఇప్పటి వరకు టాలీవుడ్లో అనుకున్న సమయానికి సినిమా మొదలు పెట్టక పోవడం, విడుదల తేదీని ఇష్టం వచ్చినన్ని సార్లు వాయిదా వేయడం లాంటివి ఉండేవి.

అయితే రాను రాను ఈ విషయంలో చాలా మార్పు వస్తోంది. మన ఫిల్మ్ మేకర్స్ లో క్రమ క్రమంగా క్రమశిక్షణ పెరుగుతోంది. రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఈ విషయంలో పక్కాగా ఉంటున్నారు. గతంలో రామ్ చరణ్ బ్రూస్ లీ చిత్రం రిలీజ్ డేట్ ముందు ప్రకటించి అనుకున్న సమయానికి రిలీజ్ చేసారు.

తాజాగా తన తర్వాతి సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. రామ్ చరణ్ త్వరలో ‘థాని ఒరువన్' తమిళ చిత్రం రీమేక్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పక్కా ప్లానింగుతో షెడ్యూల్ తయారు చేసినట్లు తెలుస్తోంది.

Ram Charan next movie on August 12

జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాని ఒరువన్' చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి హైలెట్ అయ్యాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. రామ్ చరణ్ ఈ మూవీలో పోలీస్ పాత్రలో నటించబోతున్నాడు. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా అరవింద స్వామి క్రిమినల్ సైంటిస్టుగా నటిస్తున్నాడు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘రక్షక్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. శృతి హాసన్, లేదా ఇలియానాను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. తెలుగులో నటించడానికి అరవింద స్వామి రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట.

English summary
Ram Charan will be seen as a fierce cop in Telugu remake of Tamil blockbuster Thani Oruvan, which also features Aravind Swamy as a criminal scientist. According to filmnagar sources, The movie releasing on August 12.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu