Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పాక్‌పై మెరుపు దాడులు.. ఇండియన్ ఆర్మీకి సలాం కొట్టిన రాంచరణ్, నితిన్!
Recommended Video

పూల్వమా ఘటన నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 14న రోజు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంట్లో పాక్ ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. ఆత్మహుతి దాడులు జరిపి 49మంది భారత జవాన్లని పొట్టనబెట్టుకున్నారు. ఈ చర్యని ఇండియా మొత్తం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఇండియన్ ఆర్మీ పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేత మొదలు పెట్టింది. పూల్వమా ఘటన సూద్రధారిని హతం చేసింది. కానీ పాక్ కి బుద్ది చెప్పడానికి ఇది సరిపోదు. మరోమారు సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో ఇంకేదైనా ప్లాన్ చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తం అయింది. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఇండియన్ ఆర్మీ మంగళవారం తెల్లవారు జామున తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది.

వెయ్యి కిలోల బాంబు
భారత వైమానిక దళాలు పాక్ పై మెరుపు దాడులు జరిపాయి. ఇది అలాంటి ఇలాంటి దాడి కాదు. ఏకంగా వెయ్యి కిలోల భీకరమైన బాంబుని ఉగ్ర స్థావరాలపై వదిలారు. పుల్వామా ఘటనకు తెగబడ్డ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నియంత్రణ కేంద్రాన్ని గుర్తించిన ఇండియన్ ఆర్మీ.. ఆ స్థావరాలని లక్ష్యంగా చేసుకుని 12 మిరాజ్ 200 జైట్ ఫైటర్స్ విమానంతో ఈ బాంబుని విసిరింది. ఈ దాడిలో 200 పైగా ఉగ్రవాదులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ అధికారికంగా ధ్రువీకరించింది.

తిరుగులేని ప్రతీకారం
పూల్వమా ఘటనకు వైమానిక దాడుల ద్వారా ఇండియా తిరుగులేని ప్రతీకారం తీర్చుకుందని చెప్పవచ్చు. పాక్ ప్రభుత్వం కూడా భారత వైమానిక దాడుల్ని ధ్రువీకరించింది. కానీ ఎలాంటి నష్టం జరగలేదంటూ బుకాయించే ప్రయత్నం చేస్తోంది. బాంబు దాడితో 30 కిమీ వరకు భయంకరమైన శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ పుల్వామా ఘటన జరిగిన 12రోజుల లోపే ప్రతీకారం తీర్చుకోవడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
|
రాంచరణ్ స్పందన
మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాక్ పై భారత వైమానిక దాడుల వార్త తెలియగానే సోషల్ మీడియాలో స్పందించారు. భారత వైమానిక దళాలని చూస్తుంటే గర్వంగా ఉంది. జై హింద్ అంటూ ఇండియా స్ట్రైక్ బ్యాక్ అనే హ్యాష్ టాగ్ ని జత )చేశాడు. రాంచరణ్ ఈ సందేశాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా.. ఉపాసన దీనిని ట్విట్టర్ లో షేర్ చేసింది.
|
మేరా భారత్ మహాన్
యువ హీరో నితిన్ కూడా వైమానిక దాడులపై స్పందించాడు. భారత వైమానిక దళాలకు సెల్యూట్. జయహో.. జైహింద్.. మేరా భరత్ మహాన్ అని నితిన్ ట్వీట్ చేశాడు. పుల్వామా ఘటనలో మరణించిన వీర జవానుల కుటుంబాలని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియా తీర్చుకున్న ప్రతీకారంపై కూడా సెలెబ్రిటీలు ఒకొక్కరుగా స్పందిస్తున్నారు.