»   » గ్రేట్: భూకంప బాధితులకు రామ్ చరణ్ సాయం

గ్రేట్: భూకంప బాధితులకు రామ్ చరణ్ సాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నేపాల్ భూకంప భాధితులకు సాయిం అందించేందుకు రామ్ చరణ్ ముందుకు వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చరణ్ తప్ప మేరే ఇతర తెలుగు హీరో కూడా ఈ విషయంలో స్పందించకపోవటం అందరినీ ఆశ్చర్యరానికి గురి చేస్తోంది. భూకంప బాధితులకు అపోలో ఆసుపత్రి తరుపున మందులు పంపుతామని, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి అవసరమైన సాయిం అందిస్తామని ఆయన తెలిపారు. రామ్ చరణ్ ని మిగతా హీరోలు సైతం ఆదర్శంగా తీసుకుని తమకు తగిన సాయిం చేస్తే బాగుండును అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక నేపాల్ భుకంప అనంతరం జరుగుతున్న సహాయ చర్యల పరిస్ధితి ని ఓ సారి సమీక్షిస్తే...

నేపాల్‌ భూకంప మృతుల సంఖ్య పదివేలకు చేరుకోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు సహాయక సిబ్బంది, విదేశాల నుంచి వచ్చిన బృందాలు దేశంలోని మారుమూలప్రాంతాలను చేరుకోవటానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రధానమంత్రి సుశీల్‌ కొయిరాలా మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భూకంప బాధితుల సహాయార్థం చేపడుతున్న చర్యలను వివరించారు.

Ram Charan Offers Help to Nepal Victims

అయితే ఈ చర్యలు ప్రస్తుత సంక్షోభావానికి తగిన స్థాయిలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుడారాలు, నీరు, ఆహారం అత్యవసరమని తెలిపారు. జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి పార్టీలన్నీ ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. రాయిటర్స్‌ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ.. అనేక గ్రామాల నుంచి సమాచారం ఇంకా రావల్సి ఉందని, మృతుల సంఖ్య పదివేలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు.

అనంతరం టెలివిజన్‌ ద్వారా జాతిని ఉద్దేశించి కొయిరాలా ప్రసంగించారు. భూకంపం కారణంగా మరణించిన వారి స్మృత్యర్థం మంగళవారం నుంచి మూడురోజులపాటు జాతీయ సంతాపదినాలుగా పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. తమను ఆదుకోవటానికి ముందుకొచ్చిన అంతర్జాతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Reacting to the most disheartening tragedy, actor Ram Charan is the first Telugu star to offer help to the victims of earthquake. Charan along with Chiranjeevi Charitable Trust decided to be part of the relief measures in Kathmandu which was heavily affected.
Please Wait while comments are loading...