»   » షాక్ : భార్య సలహాపై చరణ్, రెండు వారాలు పాటు దూరంగా

షాక్ : భార్య సలహాపై చరణ్, రెండు వారాలు పాటు దూరంగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'డిజిటెల్ డెటాక్స్ '...... ఈ పదం చాలా కొత్తగా అనిపిస్తోంది కదూ. కంగారుపడకండి..అదేమి వింత పదం కాదు..దాని అర్దం ఏమిటంటే...సెలఫోన్స్ తో సహా ఎలక్ట్రానిక్స్, డిజిటిల్ అప్లైయిన్స్ ఏమీ లేకుండా ఉండటం. గత రెండు వారాలుగా రామ్ చరణ్, ఆయన భార్య ఈ డిజిటెల్ డెటాక్స్ పాటిస్తూ ఉన్నారు. వారు సెల్ పోన్స్ సైతం ఏ ఎలక్ట్రానిక్, డిజిటల్ వస్తువూ వాడలేదు.

ఈ ధెరపి చాలా అద్బుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. జీవితాన్ని తిరిగి మనలో కోల్పోయిన చైతన్యాన్ని నింపుతుందని అంటున్నారు. ప్రతీ సంవత్సరం ఇలా ఉపాసన తన భర్తను ఈ ధెరపీకు తీసుకు వెల్తుంది. డిజిటల్ వెకేషన్ పాటిస్తుంది. ఈ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా కమ్యునికేట్ కూడా చేయకూడదు. అయితే చాలా కష్టం ఈ రోజుల్లో ఎవరికైనా.

Ram Charan on a 'digital detox'

ముఖ్యంగా రామ్ చరణ్ వంటి సెలబ్రెటికు మరీను. ఆయన షూటింగ్ షెడ్యూల్స్, కమిట్ మెంట్స్ మధ్యన ఇలా డిజిటిల్ డెటాక్స్ అంటూ ఎలక్ట్రానిక్ గూడ్స్ కు దూరంగా గడపటం గొప్ప విషయమే. అయితే ఇది ఉపాసన కోరిక, దాంతో రామ్ చరణ్ తన భార్య మాటకు విలువ ఇచ్చి ఇలా ముందుకు వెళ్లాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం 'ధృవ' కోసం చాలా శ్రమిస్తున్నారు. ఇందుకోసం రెండు నెలల సమయం తీసుకుని 10 కేజీల బరువు తగ్గారు. బరువు తగ్గిన చరణ్‌ని చూస్తూ చాలా మంది ఆశ్చర్యపోయారు.'ధృవ' చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం టీమ్ అంతా కాశ్మీర్ కు వెళ్తున్నారు. అక్కడ రామ్ చరణ్, రకుల్ ప్రీతి సింగ్ ల మీద సీన్స్ చిత్రీకరిస్తారు. అలాగే తెలుగు నేటివిటీ కోసం చిత్రం కథలో పూర్తి మార్పులు చేసినట్లు తెలుస్తోంది.తమిళం కన్నా తెలుగులో మరింత స్టైలిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సురేంద్రరెడ్డి బావిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన 'తని ఒరువన్‌'కి ఇది రీమేక్‌. ఇందులో రామ్‌చరణ్‌ అథ్లెటిక్‌ దేహంతో కనిపించనున్నారు.

English summary
Upasana intends to take Ram Charan on a digital detox vacation every year. During that period he won’t be allowed to make any calls or communicate with any person on any electronic medium. That’s a tough one for Ram Charan considering his shooting schedules and other commitments. But then it’s Upasana’s wish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu