'ఆరంజ్’ టాగ్ లైన్ ‘ఓ రేంజ్ లవ్ స్టోరి’ కాస్తా ‘లవ్ ఇన్ ఫాల్’
బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో నాగబాబు నిర్మిస్తున్న చిత్రం 'ఆరంజ్". 'ఆరంజ్" టాగ్ లైన్ 'ఓ రేంజ్ లవ్ స్టోరి" కాస్తా 'లవ్ ఇన్ ఫాల్" గా మారింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా షాజన్ పదమ్ సీ నటిస్తోంది. ఈ చిత్రం సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇటీవలే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆస్ట్రేలియాలో అక్టోబర్ 12 నుండి 30 వరకు జరుగుతోంది. అక్టోబర్ 30వరకూ జరిగే ఈ షెడ్యూల్ లో నృత్య దర్శకుడు శోభి దర్శకత్వంలో రెండు పాటల్ని చిత్రీకరించనున్నారు. అలాగే హాలీవుడ్ స్టట్ మాస్టర్ సహాయంతో రెండు యాక్షన్ సీన్స్ ని కూడా చత్రీకరించుటకు ప్లాన్ చేసున్నారు. నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఆడియోను దసరా తర్వాత(అక్టోబర్ 22)న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











