twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రచ్చ రచ్చే (రామ్ చరణ్ 'రచ్చ' ప్రివ్యూ)

    By Srikanya
    |

    రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఏప్రియల్ 5న అత్యధిక ప్రింట్లతో విడుదల అవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ మెడికో గా కనిపించనున్నారు. ఈ చిత్రం పాటలు విడుదలైన దగ్గరనుంచి ప్రి రిలీజ్ హంగామా మొదలైపోయింది. ఏమైంది ఈ వేళ వంటి చిన్న చిత్రం డైరక్ట్ చేసిన సంపత్ నందికి ఇంత పెద్ద చిత్రం ఆఫర్ రావటంతో అంతా ఈ చిత్రం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అందులోనూ రామ్ చరణ్ ఆరెంజ్ వంటి మెగా ప్లాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం చాలా అంచనాలే ఉన్నాయి. మాస్ ఎంటర్టైనర్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నామని మొదటి రోజు నుంచి చెప్పటం,అబిమానులు ఏమైతే ఆశిస్తున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని హామీ ఇవ్వటం ఈ సినిమాకు విపరీతమైన హైప్ తెచ్చిపెట్టింది.

    'రచ్చ' అంటే ఆనందంతో సెలబ్రేట్‌ చేసుకునేది అని మా చిత్రంలోని అర్థం. చిత్ర కథ కూడా అలాగే ఉంటుంది. హీరో ఎప్పుడూ అన్నింటిలో ముందుండాలనుకునే వ్యక్తి. అందరినీ ఎలా రచ్చ చేశాడు అన్నది పాయింట్‌. అని దర్సకుడు సంపత్ నంది తమ చిత్రం రచ్చ చిత్రం టైటిల్ గురించి చెప్పారు. అలాగే మణిశర్మ ఆడియోకు మంచి స్పందన వచ్చింది. చిన్నిచరణ్‌, చంద్రబోస్‌ చక్కటి సాహిత్యాన్ని అందించారు. 'తిల్లా తిల్లా తెల్లకోడిపిల్ల..' అనే పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు.

    ఈ చిత్రంలో హైలెట్స్ ... రామ్ చరణ్ అగ్రిసెవ్,రగ్గడ్ క్యారెక్టరైజేషన్,తమన్నా ని ఇప్పటివరకూ చూపించిని మాస్ యాంగిల్లో ఎక్సప్లోర్ చేయటం. సినిమాలో ఉన్న ఇద్దరు విలన్స్ కి కథలో ప్రత్యేకత ఉండటం. మఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే 45 నిముషాల సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ గా వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో, సెకండాఫ్ యాక్షన్ తో నడుస్తుంది. తెలుగులో టాప్ కమిడియన్స్ మొత్తం ఈ చిత్రంలో కనిపించి నవ్విస్తారు.

    ఇక ముఖ్యంగా చైనాలో చిత్రీకరించిన ఫైట్, గోవాలో తీసిన కారు ఛేజ్ ఊపిరిసలపనివ్వని విధంగా చిత్రీకరించారు. పరుచూరి బ్రదర్స్ చాలా గ్యాప్ తర్వాత రాసిన మాస్ డైలాగ్స్ ధియోటర్స్ లో విజిల్స్ వేయిస్తాయి. ఇప్పటికే ఆ డైలాగ్స్ తో కట్ చేసిన ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఎక్కడా లాగ్ లేకుండా రాపిడ్ స్పీడు తో ఈ యాక్షన్ ఎంటర్ ఎక్కడా బోర్ కొట్టనివ్వదని సెన్సార్ టాక్. పాటల్లో తీస్ మార్ ఖాన్ రచ్చ ,వాన వాన వెల్లువాయే రెండూ టాప్ గా ఉండి అబిమానులను ఉర్రూతలూగిస్తాయి.

    బ్యానర్: మెగాసూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ ప్రై.లిమిటెడ్‌
    నటీనటులు: రామ్ చరణ్ తేజ్, తమన్నా, నాజర్‌, కోటశ్రీనివాసరావు, ముఖేష్‌ రుషి, పార్తీబన్‌, బ్రహ్మానందం, అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి, సుధ, హేమ అజ్మల్ తదితరులు
    సమర్పణ :ఆర్‌.బి.చౌదరి
    సంగీతం: మణిశర్మ
    ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి
    రచన: పరుచూరి బ్రదర్స్‌
    ఎడిటింగ్: గౌతంరాజు
    కళ: ఆనంద్‌సాయి
    కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి
    నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది

    English summary
    5th April is the day of Ram Charan’s ‘Rachcha’ release, Publicized as a mass action entertainer with Cherry presented altogether in a new focus from the vision of director Sampath Nandi and what to say the sensational hit talk for audio further raised the expectations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X