»   » ఆన్ లొకేషన్ ఫొటోలు: రామ్ చరణ్ & రకల్ ప్రీతి ఇటలీ

ఆన్ లొకేషన్ ఫొటోలు: రామ్ చరణ్ & రకల్ ప్రీతి ఇటలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ , శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్ లో జరుపుకుంటుంది. సమాచారం ప్రకారం చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య పాటలు చిత్రీకరించారు. నేటితో ఈ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమాకోసం చరణ్ థాయ్ లాండ్ లో ఫైట్ ల శిక్షణ పొందాడు. కోనావెంకట్ , గోపీమోహన్ ఈ సినిమాకు స్క్రిప్ట్ ని అందిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. దానయ్య డి.వి.వి నిర్మాత.

ఇక ఈ చిత్రానికి సంభందించిన ఇటలీ షూటింగ్ స్పాట్ లో ఫొటోలు బయటకు వచ్చాయి. రామ్ చరణ్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో వాటిని షేర్ చేసారు. షూటింగ్ స్పాట్ లో తీసిన ఈ ఫొటోలు మీ కోసం...

స్లైడ్ షో లో ఫొటోలు....

రిలీజ్ ...

రిలీజ్ ...

ఇక ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు.

బ్యానర్ పై...

బ్యానర్ పై...

డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

దర్శకుడు మాట్లాడుతూ....

దర్శకుడు మాట్లాడుతూ....

''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ....

నిర్మాత మాట్లాడుతూ....

''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

ప్రేరణ...

ప్రేరణ...

ఈ చిత్రం స్టోరీ లైన్ చిరంజీవి నటించిన ‘విజేత' మూవీ ప్రేరణతో తయారు చేసారని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

టైటిల్ ఏంటి

టైటిల్ ఏంటి

ప్రస్తుతం ఈ చిత్రాన్ని ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. అయితే ఇది అఫీషియల్ టైటిల్ కాదు.

స్టంట్ మాస్టర్ గా...

స్టంట్ మాస్టర్ గా...

ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా నటించబోతున్నాడు. పాత్రలో రియాల్టీ కోసం థాయ్ లాండ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని జైకా స్టంట్ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు చరణ్. థాయ్‌లాండ్ లోని ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లలో ఇదీ ఒకటి.

చెల్లి సెంటిమెంట్ తో...

చెల్లి సెంటిమెంట్ తో...

ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా నడుస్తోంది

కామెడీకి ప్రధమస్ధానం

కామెడీకి ప్రధమస్ధానం

ఈ సినిమాలో కామెడీకు పూర్తి ప్రయారిటీ ఇచ్చి రూపొందించినట్లు సమాచారం.

ఎవరెవరు...

ఎవరెవరు...

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan and beautiful lady Rakul Preet Singh are right now chilling out in Europe. They are in Italy to shoot for the songs of upcoming movie that is being directed by Sreenu Vytla.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu