»   » ఉపాసనకి గిఫ్టులివ్వను, అతనితో టీ తాగాలనుంది.... ధృవ ప్రమోషన్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్

ఉపాసనకి గిఫ్టులివ్వను, అతనితో టీ తాగాలనుంది.... ధృవ ప్రమోషన్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ నటించిన ధృవ సినిమా విడుదల దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లు భారీ స్థాయిలో అమలు చేస్తున్నారు. విరివిగా ఇంటర్వ్యూలలో పాల్గొనడమేకాక సినిమాలో ముఖ్యమైన ఒక నిముషం సన్నివేశాన్ని విడుదలచెయ్యడం కొత్త పద్ధతినే చెప్పాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా వారసుడు రామ్ చరణ్ హీరోగా నటించిన "ధృవ" సినిమా డిసెంబర్ 9వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పుంజుకున్నాయి. ఓ వైపు డిసెంబర్ 4వ తేదీన ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతుండగా, మరో వైపు చిత్ర హీరో రామ్ చరణ్ వంటి వారు బుల్లితెరపై ప్రమోషన్ కార్యక్రమాల కోసం షూటింగ్ లు నిర్వహిస్తున్నారు.

రామ్ చరణ్ తాజా చిత్రం ధృవ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్ జోరుని మెల్లగా పెంచుతోంది.ప్రమోషన్ పై ద్రుష్టి సారించిన చిత్ర బృందం చిత్రానికి సంబందించిన రామ్ చరణ్ ఫోటోలను వదులుతోంది.ఇప్పటికే ధృవ టీజర్ తెలుగురాష్ట్రాలలో అన్ని థియోటర్ లలో ప్రదర్శింపబడుతోంది.ఈ చిత్రం లో రామ్ చరణ్ పోలీస్ పాత్రలో నటిస్తుండడం, చరణ్ లుక్స్ కూడా బావుండడంతో చిత్రం పై ఆసక్తి పెరుగుతోంది.ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా అరవింద స్వామీ, రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ లలో భాగంగా చరణ్ కి వింత వింత ప్రశ్నలు ఎదురవుతున్నాయి... అన్నిటికీ తమాషాగానో, తెలివిగానో ఆకట్టుకునే సమాధానాలు చెప్తూ వస్తున్నాడు చెర్రీ... ఈ మధ్య ఎదురైన ప్రశ్నలకి ఎలా సమాధానాలు చెప్పాడో చూడండి...


విడుదలకు ముందే హంగామా:

విడుదలకు ముందే హంగామా:

ఒకప్పుడు సినిమా విడుదలైన తర్వాత ఫలితాన్ని బట్టి మాత్రమే ఇలా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనేవారు. కానీ, ‘బాహుబలి, శ్రీమంతుడు' సినిమాల పుణ్యమా అని తెలుగు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తిగా మారిపోవడంతో, ప్రస్తుతం చిన్న, పెద్ద హీరోల సినిమాలన్నీ విడుదలకు ముందే హంగామా ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రమోషన్ కార్యక్రమాలను బట్టే సినిమా ఓపెనింగ్స్ కూడా ఆధారపడి ఉంటున్నాయి.


అనసూయ చేసిన ఇంటర్వ్యూ

అనసూయ చేసిన ఇంటర్వ్యూ

ఈ విషయంలో "ధృవ"కు ఏమీ లోటు లేకుండా చెర్రీనే రంగంలోకి దిగడంతో... ఆ ఆసక్తికర సంగతులు గురించి మెగా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు.ఈ క్రమంలో బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ చేసిన ఓ ఇంటర్వ్యూ లో అతనికి ఒక కొత్త ప్రశ్న ఎదురైంది. కొంత వింతగానే అనిపించినా రామ్ చరణ్ థింకింగ్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని అంచనా వేసేలా ఉందీ ప్రశ్న. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే..


డెబ్యూ ఆర్టిస్ట్ రామ్ చరణ్ కి :

డెబ్యూ ఆర్టిస్ట్ రామ్ చరణ్ కి :

ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిలదొక్కుకున్న 9ఏళ్ళ తరువాత ఇప్పుడున్న స్టార్ హీరో చరణ్ ని టాలీవుడ్ లో రాకముందు వున్న చరణ్ కలిస్తే కొత్తగా సినిమాల్లోకి రాబోతున్న డెబ్యూ ఆర్టిస్ట్ రామ్ చరణ్ కి ఇప్పటి స్టార్ గా ఎటువంటి సలహా ఇస్తారనే ప్రశ్న ఎదురైంది. సమాధానం ఏం చెబుతాడా అని చూసినవాళ్లకి చ్రణ్ చీప్న ఆన్సర వెరీ బ్రిలియంట్ అనిపించింది.


ఎలాంటి సలహా ఇవ్వనని:

ఎలాంటి సలహా ఇవ్వనని:

దానికి చరణ్ సమాధానం ఏమిటంటే "నువ్వు ఎటువంటి దాని గురించి ఆలోచించకుండా నీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళమని చెప్తానూ" అని . అంటే దాదాపుగా ఎలాంటి సలహా ఇవ్వనని తెలిపాడు. అంతేకాక ఇప్పటిదాకా అతను చేసిన అన్ని సినిమాలూ ఎంతో నచ్చే చేశానని ఫలితాలపై పెద్దగా పట్టించుకోనని తెలిపాడు.


హిస్టరీలోకి వెళ్ళి:

హిస్టరీలోకి వెళ్ళి:

అంతే కాదు తన సోషల్ మీడియా ప్రమోషన్ లో భాగంగా అభిమానులతో చాట్ చేసినప్పుడు కూదా ఒక అభిమాని ఒక వింత ప్రశ్న వేసాడు. అసలు హిస్టరీలోకి వెళ్ళి ఎవరితో అయినా కలవాలి అనకుంటే ఎవర్ని కలుస్తారు ? అన్న వింత ప్రశ్న వేసి చరణ్ ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు


హిట్లర్ ను కలవాలని ఉంది:

హిట్లర్ ను కలవాలని ఉంది:

దానికినికి చరణ్ ఏమాత్రం మొహమాట పడకుండా జర్మని నియంత హిట్లర్ ను కలవాలని ఉంది అంటూ ఆ అభిమానికి షాక్ ఇచ్చాడు. అయితే అక్కడితో వదిలి పెట్టలేదతను ఎవరైనా మంచి వాళ్లని కలవాలి అనుకుంటారు గానీ అలాంటి వ్యక్తిని కలవటం ఏమిటీ అన్నట్టు అర్థం వచ్చే ఇంకో ప్రశ్న వేసాడు కానీ హిట్లర్ ను కలిసే ఈవింత కోరిక ఏమిటి అని తిరిగి ప్రశ్నించాడు ఆ అభిమాని.


అంత చీప్ గా ఎలా ఆలోచించాడో :

అంత చీప్ గా ఎలా ఆలోచించాడో :

దానికి కూడా చరణ్ ఏ మాత్రం తన అభిప్రాయం మార్చుకోకుండా ‘నేను హిస్టరీలోకి వెళ్లే సౌలభ్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా హిట్లర్ ను కలవాలని అనుకుంటున్నా. అతనితో కూర్చొని టి తాగి, అతను అసలు అంత చీప్ గా ఎలా ఆలోచించాడో తెలుసుకుంటా. వీలైతే అతని బుర్రలోకి దూరి, అసలు అంతటి అమానుషమైన ఆలోచనలు ఎలా చేసేవాడో తెలుసుకుంటా' అంటూ తన అభిప్రాయాలను తెలియచేసాడు.


 సాధారణ భార్యా భర్తల్లానే:

సాధారణ భార్యా భర్తల్లానే:

ఇదే సందర్భంలో చరణ్ మరొక ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను ఉపాసనకు ఖరీదైన గిఫ్టులు ఇవ్వనని, కేవలం కాఫీ మగ్గులు వంటివే కొని ఇస్తానని.. ఖరీదైన గిఫ్టుల మీద తమ ఇద్దరికీ ఎక్కువగా ఎటువంటి మక్కువ లేదని అంటూ చెప్పిన రామ్ తమ ఇద్దరి మధ్యా ఉన్న రిలేషన్ షిప్ సాధారణ భార్యా భర్తల్లానే ఉంది తప్ప మరీ హైఫై థాట్స్ తో లేమన్న విషయం అర్థమయ్యేలా చేసాడు.


 ఉపాసనతో కలిసి స్కీయింగ్ :

ఉపాసనతో కలిసి స్కీయింగ్ :

ఇదే ఛాటింగ్ లో చరణ్ తనకు ఖాళీ సమయం దొరికితే మాత్రం యురోప్ వెళ్ళి అక్కడ స్కీయింగ్ నేర్చుకోవాలని అని అంటూ తన భార్య ఉపాసనతో కలిసి మంచు కొండల్లో స్కీయింగ్ చేయాలని ఉంది అంటూ మరొక కోరిక బయట పెట్టాడు. మొత్తానికి చరణ్ ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు ఒక హుందా తనం తో కనిపిస్తున్నాడు.


మరో కొన్నేళ్ళపాటు :

మరో కొన్నేళ్ళపాటు :

ఇదివరలో ఇలా మాట్లాడటానికి కాస్త మొహమాటం ఫీలయ్యే చరణ్ ఇప్పుడు మాత్రం అభిమానులతో చక్కగా కలుపుగోలుగా మాట్లాడుతూ... చిరు కీ ఆయన అభిమానులకీ మధ్య ఉండే లాంటి రిలేషన్ నే తానూ బిల్డప్ చేసుకునే ప్రయత్నం లో ఉన్నాడు. ధృవ గనక మంచి హిట్ కొడితే మరో కొన్నేళ్ళపాటు రామ్ చరణ్ బిజీ హీరోగా మారిపోతాడు. ఇంత హైప్ తెచ్చిన సినిమా తనని నిలబెడుతుందనే ఆశతోనే ఉన్నాడు చెర్రీ ఆ ఆశ తీరేలానే కనిపిస్తోంది మరి.


English summary
Mega power star Ram Charan's action-thriller Dhruva movie is gearing up for its release tomorrow i.e on December 9, 2016 . As part of Dhruva promotions, Ram Charan has revealed interesting things about the film with media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more