»   » అంత వరకూ నా ప్రేమ మీకే... : రామ్‌చరణ్‌

అంత వరకూ నా ప్రేమ మీకే... : రామ్‌చరణ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, జెనీలియా జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'ఆరెంజ్‌' ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చెర్రీ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా గుర్తు చేసుకున్నారు. తన హృదయానికి చాలా దగ్గరైన చిత్రం 'ఆరెంజ్‌' అని పేర్కొన్నారు.

Orange completes 5 years. A movie very close to my heart.... Antha varuku na Prema meeke. !!


Posted by Ram Charan on 25 November 2015

ఈ సందర్భంగా చిత్రంలోని 'అంత వరకూ నా ప్రేమ మీకే...' అనే డైలాగ్‌ను పోస్ట్‌ చేశారు. భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగేంద్రబాబు నిర్మాతగా వ్యవహరించారు.


రామ్ చరణ్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...


కొద్ది కాలం క్రిందట తమిళనాట విడుదలై సూపర్ టాక్ తో దూసుకుపోతున్న ' 'తని ఒరువన్‌'' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ తో చేయటానికి రంగం సిద్దమయినట్లే అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం రైట్స్ ని ఐదున్నర కోట్లకు పొందినట్లు సమాచారం. తమిళంలో డైరక్ట్ చేసిన దర్శకుడు మోహన్ రాజానే మొదట ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసేందుకు అనుకున్నారు. అయితే చివరి నిముషంలో సురేంద్ర రెడ్డి సీన్ లోకి వచ్చారు.


Ram Charan remembers Orange movie

ఈ సినిమాకు మెగా ఫోన్ పట్టుకునేది సురేంద్రరెడ్డి అనే క్లారిటీ రావటంతో... హీరోయిన్ గా సమంత పేరు దాదాపుగా ఖరారైందని ప్రచారం మొదలైంది దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా హిట్టే అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.


రామ్ చరణ్ మాట్లాడుతూ...ఇదివరకు రీమేక్‌ సినిమాలు చేయకూడదు అనుకొనేవాణ్ని. కానీ అలాంటి నిబంధనలేవీ పెట్టుకోకూడదనే ఓ నిర్ణయానికొచ్చా. 'తని ఒరువన్‌' నాకు బాగా ఇష్టం. అందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర చాలా ముఖ్యం. ఆ పాత్రకి తగ్గ నటుడు దొరికితే వెంటనే సినిమాని మొదలుపెడతాం. ఆ తర్వాత గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాని చేయబోతున్నా. అదొక ప్రేమకథతో తెరకెక్కబోతోంది.


English summary
Ram Charan shared in FB: "Orange completes 5 years. A movie very close to my heart.... Antha varuku na Prema meeke. !!"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu