»   » నాన్న మెగాస్టార్ అని నాకు తెలియదు, తలకు గాయమై కుట్లుపడ్డాయ్: రామ్ చరణ్

నాన్న మెగాస్టార్ అని నాకు తెలియదు, తలకు గాయమై కుట్లుపడ్డాయ్: రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండస్ట్రీలో స్టార్ కిడ్ అనే మార్క్ ఎంత మేలు చేస్తుందో అంతటి ఇబ్బందినీ తెచ్చి పెడుతుంది. ఎందుకంటే ప్రతీ అడుగుమీదా జనాల దృష్టి ఉంటుంది, నటనలో, ప్రవర్తనలో నాన్నతో పోల్చి చూడటం ఉంటుంది. అయితే ఆ మార్క్ తన మీద పడకుండా తనకంటూ సొంత ట్రాక్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు రామ్ చరణ్. అయితే ఇప్పుడు మనకు కనిపించే హీరో చరణ్ మాత్రమే మనకు తెలుసు కానీ మెగాస్టార్ కొడుకుగా చెర్రీ ఎలా ఉండేవాడు? చిరు తో చెర్రీ బాల్యం ఎలా గడిచిందీ అన్న విషయాలు బయటకి తెలిసింది తక్కువే... అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నాన్నతో తన అనుభవాలని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు రామ్ చరణ్....

మెగాస్టార్ అనే విషయం తెలీదు

మెగాస్టార్ అనే విషయం తెలీదు

‘‘నాకు పది పదిహేనేళ్లు వచ్చేవరకూ మా నాన్న మెగాస్టార్ అనే విషయం తెలీదు. తెలియనిచ్చేవారు కాదు. లో ప్రొఫైల్ లో మమ్మల్ని పెంచారు. సినిమా విషయాలు మా వరకు వచ్చేవి కావు. నాకు పదేళ్ల వయసున్నపుడు నాన్న స్కేటింగ్ షూస్ కొనిచ్చారు. అప్పటి నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.

నుదుటికి గాయమైంది

నుదుటికి గాయమైంది

అవి కట్టుకుని ఇళ్లంతా తిరిగేశాను. అయితే అప్పటి వరకూ వాటిని వాడి ఉండక పోవటం తో కొత్తలో ఒకసారి జారి కింద పడ్డాను. నుదుటికి గాయమై నాలుగు కుట్లు కూడా పడ్డాయి. ఐతే స్కేటింగ్ షూస్ నా దగ్గరున్నాయనే ఆనందంలో ఆ బాధ కూడా కనిపించలేదు.

లంకేశ్వరుడు

లంకేశ్వరుడు

ఇక నాన్న షూటింగ్ కు తొలిసారి వెళ్లింది దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ‘లంకేశ్వరుడు' సినిమాకే. ఆ సినిమాలో నాన్న వెంట ఎప్పుడూ ఓ చిరుతపులి ఉంటుంది. దాన్ని చూడగానే నాకు భయం వేసింది. ఐతే నాన్న నాకు ధైర్యం చెప్పి దగ్గరకు తీసుకెళ్లి పులిని ముట్టుకొనేలా చేశారు. ఆ సంఘటన నాకెప్పటికీ గుర్తుండిపోతుంది.

మరిచిపోలేని ప్రయాణం

మరిచిపోలేని ప్రయాణం

ఇక నాన్నతో పాటు విదేశాలకు వెళ్లిన సందర్భాల్లో మరిచిపోలేనిది ఒకటుంది. ‘అన్నయ్య' సినిమా షూటింగ్ కోసం నాన్నతో పాటు నాకు స్విట్జర్లాండ్ వెళ్లాలనిపించింది. ఐతే నాలుగు రోజుల్లో స్కూల్ మళ్లీ మొదలవబోతుండగా నాన్న బయల్దేరుతున్నారు. స్కూల్ మానేస్తానంటే నాన్న ఊరుకోరు.

కొడతారేమోనని భయపడ్డా

కొడతారేమోనని భయపడ్డా

కానీ నాకు మాత్రం స్విట్జర్లాండ్ వెళ్లాలని బలమైన కోరిక. అందుకే అమ్మ దగ్గరికెళ్లి విషయం చెప్పాను. ఆమె నాన్నకు చెప్పింది. నాన్న పిలిచారు. కొడతారేమోనని భయపడుతూనే వెళ్లాను. ఆయన ఒక నవ్వు నవ్వి బట్టలు ప్యాక్ చేసుకోమన్నారు. నా ఆనందానికి అవధుల్లేవు. ఆ పర్యటనను ఎప్పటికీ మరిచిపోలేను'' అని చరణ్ తెలిపాడు.

English summary
Ram Charan shared some Sweet Moments from child Hood with his father Megastar
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu