»   » ఫోర్న్ తో సహా రామ్ చరణ్ ని అన్ని అడిగారు, ఆయనేం అన్నాడు

ఫోర్న్ తో సహా రామ్ చరణ్ ని అన్ని అడిగారు, ఆయనేం అన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ తొలిసారి ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో లైవ్‌చాట్‌ చేశారు. ఈ లైవ్ ఛాట్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ధృవ గురించి, చిరు 150 వ చిత్రం గురించి, తమ అభిమాన హీరోలపై అభిప్రాయం, కబాలి గురించి ఇలా రకరకాల ప్రశ్నలు అడిగారు. చివరకి మీరు ఫోర్న్ ఇష్టమా అనే ప్రశ్నను సైతం అడిగారు. అయితే ఇంతకీ వారేం ప్రశ్నలు అడిగారు. ఆయనేం సమాధానం ఇచ్చారు అనేది మీరు ఈ క్రింద చదవచ్చు.

అలాగే ఆయన ఈ లైవ్ ఛాట్ లో ఓ కొత్త ప్రపోజల్ లాంటి ఆఫర్ తన అభిమానులకు పెట్టారు. అందరూ మంచి పనులు చేయాలన్న ఉద్దేశంతో 'మెగాఫ్యాన్‌ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

చిరు అభిమానులు సమాజ సేవలో భాగంగా తమ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛభారత్‌, నీటి సమస్యను పరిష్కరించడం వంటి కార్యక్రమాలు చేసి ఆ విషయాలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేయాలని కోరారు.

ఉత్తమమైన సేవ చేసిన వారిని తన తండ్రి చిరంజీవి 150వ సెట్‌కు తీసుకెళ్తామని, మొత్తం యూనిట్‌ సభ్యులు ఆ వ్యక్తిని ప్రశంసిస్తారని తెలిపారు. తమ అభిమాన హీరో మెగాస్టార్‌ చిరంజీవిని కలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఆయన ఫ్యాన్స్ అయితే దూరం నుంచి చూసినా చాలనుకునేవారు లక్షల్లో ఉంటారు. మరి అలాంటి అవకాశాన్ని తాను కల్పిస్తానని అంటున్నారు రామ్‌చరణ్‌.ఇది ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

చిరంజీవి ఎలా ఉన్నారు?

చిరంజీవి ఎలా ఉన్నారు?


నాన్నగారు చాలా బావున్నారు, షూటింగ్‌ ఆహ్లాదకరంగా జరుగుతోంది

చిరంజీవి 150లో మీరు ఉన్నారా?

చిరంజీవి 150లో మీరు ఉన్నారా?నేను చిరంజీవి గారి చిత్రంలో ఉన్నానని చెప్పలేను. ఏదైనా పాటలో, లేదా మరేదైనా చిన్న పాత్ర వేస్తే బాగుంటుందనుకుంటున్నా

చిరంజీవి చిత్రం రిలీజ్ గురించి చెప్పండి?

చిరంజీవి చిత్రం రిలీజ్ గురించి చెప్పండి?


ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. సంక్రాంతికి చిత్రాన్ని తీసుకొస్తాం

 చిరు 150 టైటిల్‌ ‘కత్తిలాంటోడు'?

చిరు 150 టైటిల్‌ ‘కత్తిలాంటోడు'?

‘కత్తిలాంటోడు' కాదు.. ఇంకా నిర్ణయించలేదు. త్వరలో మంచి టైటిల్‌ను నిర్ణయిస్తాం

 ‘ధ్రువ' విడుదల ఎప్పుడు?

‘ధ్రువ' విడుదల ఎప్పుడు?


ధ్రువ షూటింగ్ చాలా స్పీడుగా జరుగుతో్ంది. అక్టోబరు తొలి వారం లేదా రెండో వారంలో ‘ధ్రువ'ను విడుదల చేస్తాం.

మీ ‘ధ్రువ' ఫస్ట్‌లుక్‌ ఎప్పుడు

మీ ‘ధ్రువ' ఫస్ట్‌లుక్‌ ఎప్పుడు


బహుశా.. ఆగస్టు 15న ఉండవచ్చు

‘ధ్రువ'లో ఫన్నీ మూమెంట్‌?

‘ధ్రువ'లో ఫన్నీ మూమెంట్‌?

ఈ చిత్రంలో నేను ఫన్నీగా ఉండే వ్యక్తిని కాను. కానీ కశ్మీర్‌ షెడ్యూల్‌లో సరదాగా గడిపాం. చిరంజీవి గారి 30 నుంచి 40 సినిమాల షూటింగ్‌ అక్కడ జరిగింది

మీ బాబాయ్ పవన్‌కల్యాణ్‌తో సినిమా తీస్తారా?

మీ బాబాయ్ పవన్‌కల్యాణ్‌తో సినిమా తీస్తారా?


వైనాట్... మంచి కథ దొరికితే.. కచ్చితంగా చేస్తా

ప్రశ్న: మహేష్ బాబుపై మీ అభిప్రాయం?

ప్రశ్న: మహేష్ బాబుపై మీ అభిప్రాయం?


జవాబు: ఆయన చాలా అందంగా బావుంటారు. మంచి నటుడు, నాకు ఇష్టమైన వ్యక్తి ఆయన.

ప్రశ్న: ప్రభాస్‌పై మీ అభిప్రాయం?

ప్రశ్న: ప్రభాస్‌పై మీ అభిప్రాయం?


జవాబు: నాకు ఇష్టమైన స్నేహితుడు. రీసెంట్ గా బాహుబలి సెట్‌కు వెళ్లా సెట్స్ అన్నీ అద్బుతంగా ఉన్నాయి.

ప్రశ్న: మీకు ఇష్టమైన హీరోయిన్?

ప్రశ్న: మీకు ఇష్టమైన హీరోయిన్?


జవాబు: ఆసక్తికరమైన ప్రశ్న.. అందరూ మంచి హీరోయిన్సే

ప్రశ్న: మీ లక్ష్యం?

ప్రశ్న: మీ లక్ష్యం?


జవాబు: ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం

ప్రశ్న: తర్వాతి చిత్రం

ప్రశ్న: తర్వాతి చిత్రం


జవాబు: సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తాను. ఆ సినిమా అక్టోబర్ లో ప్రారంభం అవుతుంది. మైత్రీ మూవి మేకర్స్ నిర్మిస్తోంది.

పవన్ బ్యానర్ లో

పవన్ బ్యానర్ లో

బాబాయ్ పవన్ బ్యానర్ లో చేయబోయే చిత్రం వచ్చే ఏడాది మొదలవుతుంది.

ప్రశ్న: ఉపాసనా ఎలా ఉన్నారు?

ప్రశ్న: ఉపాసనా ఎలా ఉన్నారు?


జవాబు: ఉపాసనా చాలా బావుంది

 ప్రశ్న: కబాలి చిత్రం గురించి?

ప్రశ్న: కబాలి చిత్రం గురించి?


జవాబు: కబాలి చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా.. అందరూ ఎదురుచూస్తున్నారు

ప్రశ్న: మల్టీస్టారర్‌ చిత్రాలపై ఆసక్తి ఉందా?

ప్రశ్న: మల్టీస్టారర్‌ చిత్రాలపై ఆసక్తి ఉందా?


జవాబు: మల్టిస్టారర్ చిత్రాలపై నాకు ఇంట్రస్ట్ ఉంది

రామ్‌చరణ్‌ తొలిసారి ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో లైవ్‌చాట్‌ చేశారు. ఈ లైవ్ ఛాట్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

English summary
Ram Charan took some time off to interact with his fans via a live Facebook chat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu