KGF Chapter 2 పై రామ్ చరణ్ రివ్యూ .. మైండ్ బ్లోయింగ్, కమాండబుల్‏ అంటూ!

దక్షిణాది సినిమాలు అన్ని చోట్లా సత్తా చాటుతున్నాయి. గతంలో తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి భారీ చిత్రాలు వచ్చేవి, కానీ ఇప్పుడు సౌత్‌కు చెందిన స్టార్ హీరోలంతా పాన్ ఇండియా బాట పడుతున్నారు. అలా 'KGF Chapter 1' కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా సత్తా చాటింది. . టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టింది. దీంతో 'KGF Chapter 2' పేరిట దానికి సీక్వెల్ తెరకెక్కించి ఇటీవల విడుదల చేశారు. ఈ మూవీకి కూడా దేశ వ్యాప్తంగా భారీ స్పందన దక్కుతోంది. ఇక ఈ సినిమా మీద ఇతర హీరోలు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఋ ఇవ్వగా ఇప్పుడు రామ్ చరణ్ రివ్యూ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

 KGF Chapter 2

KGF Chapter 2


కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రం 'KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా అధీరా పాత్రలో సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రవీనా టాండన్ రమికా సేన్ అనే ఒక కీలక పాత్రలో నటించారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చగా ఉజ్వల్ అనే 19 ఏళ్ళ కుర్రాడు ఎడిటర్ గా వ్యవహరించారు.

రామ్ చరణ్ రివ్యూ

రామ్ చరణ్ రివ్యూ


సినిమా విడుదలైనప్పటి నుంచి యశ్ నటనపై.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ఇటీవల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాకింగ్ స్టార్ యశ్ నటనపై.. కేజీఎఫ్ 2 సినిమాపై తన రివ్యూ ఇచ్చేశాడు.

అత్యుత్తమ నటన

అత్యుత్తమ నటన


''నా బ్రదర్ ప్రశాంత్ నీల్ కు కంగ్రాట్యులేషన్స్, ఇంతటి భారీ హిట్ కొట్టినందుకు హోంబలే టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్. యశ్ నీ నటన మైండ్ బ్లోయింగ్, స్రీన్ మీద ఎంతో కమాండబుల్‏గా అనిపించాడు. అని రామ్ చరణ్ పేర్కొన్నారు. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజు, రావు రమేష్ గారి కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ నటన అనిపించేలా ఉంది.''

 సంచలన రికార్డులు

సంచలన రికార్డులు


శ్రీనిధి శెట్టి, మాళవిక అవినాష్, ఈశ్వరీ రావు, అర్చన జోయిస్, రవి బస్రూర్ అందరూ నటన అద్భుతం అనిపించారు. సాంకేతిక నిపుణులు అందరికీ కుడోస్ " అంటూ చరణ్ రాసుకొచ్చారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సంచలన రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది.

ప్రమోషన్స్ లో బిజీగా

ప్రమోషన్స్ లో బిజీగా


ఇక మరో పక్క చరణ్ ప్రస్తుతం ఆచార్య సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా 23వ తేదీ సాయంత్రం యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X