twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రికి రామ్ చరణ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్టు ఏమిటో తెలుసా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తండ్రి మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ గతంలో పుట్టినరోజు గిఫ్టులుగా అత్యంత ఖరీదైన కార్లు కొనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం తన తండ్రి జీవితంలో గుర్తిండి పోయేలా 60వ పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా నిర్వహించాడు రామ్ చరణ్. ఇందుకోసం చరణ్ భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

    అంతే కాకుండా ప్రత్యేకమైన గిఫ్టు ఇచ్చాడు. చిరంజీవి పేరుతో ఫేమస్ అయిన ‘చిరంజీవి దేసె' పేటెంట్ హక్కులను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రముఖులకు చిరంజీవి దోసె రుచి చూపినట్లు సమాచారం.

    Ram Charan's B'Day Gift To Chiranjeevi

    రామ్ చరణ్ ఇప్పటికే సినిమాల ద్వారా చేతి నిండా సంపాదిస్తున్నారు. తాజాగా ఆయన వ్యాపార రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ట్రూ జెట్ విమానాల ద్వారా విమాన రంగం బిజినెస్ లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ త్వరలో రెస్టారెంట్ వ్యాపారంలోకి కూడ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో రెస్టారెంట్లను ప్రారంభించబోతున్నట్లు, ఈ రెస్టారెంట్లలో ‘చిరంజీవి దోసె' ప్రత్యేక వంటకంగా లభించబోతోందని రామ్ చరణ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

    చిరంజీవి దోసె కథ ఏంటి?
    దాదాపు 25 సంవత్సరాల క్రితం మైసూరు సమీపంలో షూటింగ్ జరుగుతున్న వేళ చిన్న దాబా హోటలుకు ఫిల్టర్ కాఫీ తాగేందుకు చిరంజీవి వెళ్లారట. కాఫీతో పాటు అక్కడ వేడివేడిగా దోసెలు తిన్నారు. వాటి రుచిలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. దాన్నెలా తయారు చేశారో చెప్పాలని ఆ హోటల్ వారిని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆ దోసెలు ఎలా చేస్తామో చెప్పబోమని, అది తమ సీక్రెట్ వంటకమని ఆ హోటల్ నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో చిరంజీవి, తమ ఇంటి వంట మనిషిని పిలిపించి, అక్కడి దోసెలు రుచి చూపించి, వాటిని ఎలా తయారు చేశారో తెలుసుకోమని చెప్పారు. రకరకాల ప్రయోగాలు చేసి చిరంజీవికి నచ్చే విధంగా 'చిరు దోసె' కనిపెట్టారు. తమ ఇంటికి వచ్చే అతిథులందరికీ ఈ దోసె ఎంతో ఇష్టమని, రజినీకాంత్ వస్తే 'దోసె ఎక్కడ?' అని అడుగుతారని, రిచర్డ్ గేర్, సచిన్ టెండూల్కర్ వంటి వారూ ఎంతో ఇష్టపడ్డారట.

    English summary
    The Mega60 birthday bash that took place at Park Hyatt on 22nd was a glittering success with celebs from all over the country attending the soiree organized perfectly by Ram Charan. A special menu was prepared for guests and the complete standout was the Chiru Dosa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X