»   » ఆ ఊసు మీకెందుకు?? ...దిమ్మ తిరిగేలా రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్

ఆ ఊసు మీకెందుకు?? ...దిమ్మ తిరిగేలా రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా హీరోలంతా వరస పెట్టి రీమేక్ లు చేస్తున్న మాట నిజం. అంతెందుకు మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ నెం 150' సినిమాతో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఆ సినిమాలో తమిళంలో హిట్టైన కత్తి రీమేక్.

మరోవైపు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమా చిత్రీకరణలో బీజీగా ఉన్నారు. ఆ సినిమా కూడా తమిళంలో అజిత్ చేసిన వీరమ్ రీమేక్. ఇక మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌ ఇటీవలే 'ధ్రువ' విజయంతో ఘనవిజయాన్ని అందుకున్నాడు.

ఈ చిత్రం కూడా తమిళంలో హిట్టైన తని ఒరువన్ రీమేక్. ఇలా వరస పెట్టి రీమేక్ లు చేస్తూండటంతో... మెగా హీరోలు రీమేక్‌లే ఎందుకు చేస్తున్నారంటూ సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. ఈ చర్చ విషయం రామ్ చరణ్ వద్దకు చేరింది. దాంతో ఆయన స్ట్రాంగ్ గానే వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో చర్చ

సోషల్ మీడియాలో చర్చ

ఇలా మెగా ఫ్యామిలీ రీమేక్స్‌పై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌కు రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రీమేక్స్ అయినా అవి కూడా సినిమాలేనని గుర్తుంచుకోవాలన్నాడు. ఆయన ఇంత స్ట్రాంగ్ గా రిప్లై చెప్తారని ఎవరూ ఊహించలేదు.

డల్లాస్ లో

డల్లాస్ లో

ధృవ సినిమా కోసం అమెరికాలో పర్యటిస్తున్న చరణ్.. డల్లాస్‌లోని ఎన్నారైలతో ప్రత్యేకంగా మీట్ అయ్యినప్పుడు ఈ విషయమై చర్చ వచ్చింది.దాంతో అక్కడే విమర్శలపై క్లారిటీ ఇచ్చేశాడు. అక్కడ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ లాగ మారింది.

ముందు మనం భారతీయులం

ముందు మనం భారతీయులం

వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసమే రీమేక్స్ చేస్తున్నామన్నాడు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు.. అని కాకుండా ముందు మనందరం భారతీయులమనీ, అదే విధంగా తమిళనాడులో రిలీజ్ అయిందా.. మహారాష్ట్రలో రిలీజ్ అయిందా అన్నది కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా దాన్ని అందిచాలని తాము భావిస్తున్నామన్నాడు.

రీమేక్ చేసేందుకు

రీమేక్ చేసేందుకు

కథల్లేకనో, కొత్త కథలతో చేయలేకనో రీమేక్స్‌ను నమ్మకోలేదని చరణ్ స్పష్టం చేశాడు. రీమేక్ చేసేందుకు అనువుగా కథలు బాగున్నప్పుడు తప్పు లేదన్నారు. అవును రామ్ చరణ్ ఒరిజనల్ కథలతో ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవీ ధృవ లాగ ఆడలేదనే విషయం నిజమే కదా.

అవధులు లేవు

అవధులు లేవు

మెగా ఫ్యామిలీ మొత్తం రీమేక్స్ ఎందుకు చేస్తోందనే కామెంట్స్‌ను అస్సలు పట్టించుకోవద్దనీ, మంచి సినిమా మీ ముందు ఉంటే వాటి ఊసెందుకన్నాడు. సినిమాకు అవధులు లేవని తాను నమ్ముతానన్నాడు. ధృవ రీమేక్ అయినా ప్రేక్షకులు ఆదరించారనీ, అదే విధంగా చిరు ‘ఖైదీ నెం-150', పవన్ ‘కాటమరాయుడు'ని ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

అందుకే మేమంతా రీమేక్ లు ..

అందుకే మేమంతా రీమేక్ లు ..

మంచి కథలను ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశంతో నిజాయితీగా చేస్తున్న ప్రయత్నమిది. అందుకే నేను, నాన్న, బాబాయ్‌ రీమేక్‌లు చేస్తున్నాం. దీనిపై మరీ ఆలోచించకుండా.. సినిమాలను చూసి ఆనందించాలంటూ ప్రేక్షకులను కోరారు.

English summary
Some are criticizing this urge for Remake Projects and are also trolling Mega Heros. But then Ram Charan came up with abefitting reply for those. In one of the interview, he responded on these trolls.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu