»   » చరణ్ సినిమా మరింత ఆలస్యం: చిరు వల్లేనట

చరణ్ సినిమా మరింత ఆలస్యం: చిరు వల్లేనట

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ "తని ఒరువన్" చిత్రాన్ని తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! నిజానికి వేగంగా షూటింగ్ పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేసేందుకు రామ్ చరణ్ ముందుగా ప్లాన్ చేసాడు చరణ్.

అయితే ప్రస్తుతం ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనుకున్నట్లు రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలిసింది. బ్రూస్ లీ సినిమాతో నిరాశపరిచిన చరణ్ వీలైనంత త్వరగా అభిమానులను సక్సెస్ తో పలకరించాలని భావిస్తున్నాడు. ,,ఇక ఈ సినిమా కోసం రామ్‌ చరణ్‌ ఓ సరికొత్త లుక్‌ ప్రయత్నిస్తున్నారట. ఇప్పటివరకూ తన ప్రతి సినిమాలోనూ ఫిజిక్‌ పరంగా స్ట్రాంగ్‌గా కనిపిస్తూనే, రకరకాల లుక్స్‌తో మెప్పించిన చరణ్‌, కొత్త సినిమాలో ఓ పోలీసాఫీసర్‌ పాత్రలో మరింత కొత్తగా కనిపించనున్నారట.

 Ram Charan's Dhruva in Dasara race

అయితే అదే సమయంలో చిరు 150 సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా భుజాల మీద వేసుకున్నాడు. వినాయక్ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న కత్తి లాంటోడు సినిమాను అల్లు అరవింద్ తో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్లాన్ చేశాడు. తన సినిమాలో హీరోగా నటిస్తూనే, తండ్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి పక్కాగా స్కెచ్ వేస్తున్నాడు.

అయితే రెండు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటే అటు "ధృవ" లో నటుడిగా ఇటు తనతండ్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం కష్టంగా మారడంతో పాటు అవుట్ పుట్ లో తేడా వస్తుందని రామ్ చరణ్ భావించాడట. అందుకే ప్రస్తుతానికి తన సినిమా "ధృవ" ని వాయిదా వేయడంతో బాటు ఆగస్ట్ నెలలో విడుదలచేయాలనుకున్న సినిమాని దసరాకు విడుదల ఆయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలిసింది..

English summary
Ram Charan's "Dhruva" release date of the movie in the month of October as a Dussehra gift
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu