»   »  న్యూ అప్డేట్: రామ్‌చ‌ర‌ణ్ ' ధృవ‌' రిలీజ్ ఖరారైనట్లే!

న్యూ అప్డేట్: రామ్‌చ‌ర‌ణ్ ' ధృవ‌' రిలీజ్ ఖరారైనట్లే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ ధృవ. గీతాఆర్ట్స్ వారు రామ్ చరణ్ తో మగధీర తర్వాత చేస్తున్న మూవీ ఇది.

గాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌పించ‌నున్నారు. అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

 బ్యాలెన్స్ సాంగ్స్

బ్యాలెన్స్ సాంగ్స్

న‌వంబ‌ర్ మొద‌టివారంలో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ పూర్త‌వుతుంది. ఒక పాట మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంటుంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

 డిసెంబర్లో

డిసెంబర్లో

త్వరలో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 నటీనటులు

నటీనటులు

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించారు.

 తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ తమిళా (ఆది), ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

English summary
Ram Charan's Dhruva, which stars Rakul Preet as the female lead, is on at a brisk pace. Produced under the prestigious Geeta Arts banner and being co-produced by Allu Aravind and NV Prasad, the film has completed its talkie portions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu