»   » నాన్నకు, బాబాయ్ కు బర్త్ డే గిప్ట్ లు రెడీ చేస్తున్న చెర్రీ

నాన్నకు, బాబాయ్ కు బర్త్ డే గిప్ట్ లు రెడీ చేస్తున్న చెర్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ సినిమా చేస్తే ఇటు బాబాయ్ కు ఇటు నాన్న చిరుకు గిప్ట్ లు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న వార్తలు ప్రకారం...మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. మెగా అభిమానులతో పాటు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, బాబాయి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

రామ్ చరణ్ ...ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధృవ'గా తెరకెక్కబోతున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తన తండ్రి పుట్టిన రోజు ఆగస్టు 22న బర్త్‌డే గిప్ట్‌గా ఇచ్చేందుకు చరణ్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్'కి రీమేక్‌‌‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

Ram Charan's Dhruva teaser on Chiru's b'day

అలాగే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర పాటలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారని చెప్తున్నారు. ఇటీవలే కశ్మీర్‌‌లో షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదారబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రంలో చరణ్‌ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ జోడీకట్టగా...నవదీప్, అరవింద్ స్వామి, పోసాని కృష్ణమురళి కీలకపాత్ర పోషిస్తున్నారు.

English summary
Ram Charan is planning to release his current movie's first teaser on 22nd August, his dad megastar Chiranjeevi's birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu