»   » రామ్ చరణ్ కొత్త సినిమా లాంచ్,టైటిల్ మాత్రం అది కాదు

రామ్ చరణ్ కొత్త సినిమా లాంచ్,టైటిల్ మాత్రం అది కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్రూస్ లీ చిత్రం పరాజయం తర్వాత రామ్ చరణ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ అయిన ఇప్పుడు ఏ సినిమా ప్రారంభించలేదు. అయితే తని ఒరువన్ రీమేక్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇవాళ రేపు అంటూ రోజులు గడుపుతూ వస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు ఈ చిత్రాన్ని లాంచ్ చేసారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం ఈ చిత్రం పూజ జరిగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేంద్ర రెడ్డి డైరక్ట్ చేస్తున్నారు.

Ram Charan's film launched

ఇక ఈ చిత్రానికి రక్షక్, ధృవ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వాటిని రామ్ చరణ్ కు చెందిన స్పోక్స్ పర్శన్ ఖండించారు. ఇప్పటివరకూ ఏ టైటిల్ ఫైనలైజ్ చేయలేదని అన్నారు. అంటే వారి దృష్టిలో వేరే టైటిల్ ఉందేమో చూడాలి. ఏదైమైనా ఇది రామ్ చరణ్ అభిమానులకు ఆనందం కలిగించే వార్తే.

English summary
Ram Charan film's Opening Pooja is held today morning. Produced by Allu Arvind on Geetha Arts banners, this remake will be directed by Surender Reddy and Hiphop Thamiza will be scoring music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu