»   »  పవర్ స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ ఎప్పూడూ లేనంతగా...... మరీ ఇలా గన్ తో

పవర్ స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ ఎప్పూడూ లేనంతగా...... మరీ ఇలా గన్ తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్... చరణ్ ఒకరు బాబాయ్ ఇంకొకరు అబ్బాయ్ అయినా ఇద్దరూ అల్లరిలో మాత్రం ఒకటే ఏజ్... ఇదే మాట మెగాస్టార్ సతీ మణి సురేఖ కూడా చాలా సార్లే చెప్పారు. పవన్ కల్యాణ్ సరదాగానే కనిపించినా ఎక్కువగా ఎవరితోనూ చనువు గా ఉండడు.. మూడీ గా కనిపిస్తాడు.. అలాగని ఉద్దేశపూర్వకంగా దూరంగాను ఉండాలనుకోడు. అయితే ఈ బాబాయ్ చరణ్ విషయంలో మాత్రం ఆయన ఇందుకు మినహాయింపుగా కనిపిస్తాడు. చరణ్ కనిపిస్తే చాలు .. ఆయనతో కలిసి సందడి చేస్తారు.

తాను తన తండ్రి దగ్గరకన్నా బాబాయ్ దగ్గరే ఎక్కువ చనువుగా ఉంటానని చరణ్ చాలాసార్లు చెప్పాడు. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో కూడా చరణ్ చాలసార్లే కనిపించాడు. స్టార్ హీరోలమనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, బాబాయ్ .. అబ్బాయ్ ల మాదిరిగానే కలిసి అల్లరి చేస్తారు. అలాంటి సమయంలో .. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా సెట్లో తీసిందే ఈ ఫోటో. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమన్నది చెప్పడానికి ఈ ఫోటో ఒక్కటి.

Ram Charan's Gift To Pawan On Birthday

పవన్ పుట్టిన రోజున చెర్రీ ఒక ఫోటోని మెగాభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ గెటప్ లో ఉంటే.. చెర్రీ ఓ కుర్తాలో సింపుల్ గా కనిపిస్తాడు. చరణ్ కుర్చీలో కూర్చుని ఉంటే.. వెనకాల నుంచున్న పవన్.. చెర్రీ మొహాన్ని గెడ్డం దగ్గర పట్టుకుని ఫోటోకు పోజిచ్చాడు. మధ్యలో సర్దార్ గన్ కూడా ఉంటుంది లెండి. దాన్ని ఇద్దరూ కలిసి హ్యాండిల్ చేసేశారు.

పవన్-చరణ్ లు గతం లో ఎప్పుడూ బయట ఇంత క్లోజ్ గా కనిపించలేదు. అందుకే ఇప్పుడు బాబాయ్- అబ్బాయ్ ల ఫొటో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. చాలామంది. రామ్ చరణ్ కు తండ్రి చిరు కంటే బాబాయ్ పవన్ దగ్గరే చేరిక ఎక్కువని.. గారాలు పోతూ ఉంటాడని చెప్పుకుంటారు లెండి. ఈ ఫోటో చూస్తే అది నిజమే అని కనిపిస్తోంది కదా.

English summary
On the occasion of Pawan Kalyan’s birthday, Ram Charan shared a photo of himself with his loving uncle Pawan on social networking site which is going viral on the internet and receiving superb responses.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu