twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుటుంబం కోసం...(గోవిందుడు అందరివాడేలే ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : తొలినుంచీ కృష్ణ వంశీ సినిమాలు ప్రత్యేకమైన శైలితో ఉంటూ వస్తున్నాయి. హమ్ ఆప్ హై కౌన్ తరహా కిక్కిసిరిన జనంతో ఉండే ఫ్రేమ్ లు తెలుగులో ఆయన సినిమాల్లోనే కనిపిస్తూంటాయి. తెలుగుదనం, మన కుటుంబ సంప్రదాయాలకూ పెద్ద పీట వేయటానికి ఆయన ప్రయత్నిస్తూంటారు. అయితే ఆయనకు గత కొంత కాలంగా హిట్ అనేది లేదు. స్టార్ హీరోలు ఎవరూ డేట్స్ ఇవ్వటానికి ఆసక్తి చూపటం లేదు. ఈ నేపధ్యంలో పామ్ లో మెగా తనయుడు రామ్ చరణ్ తేజ సినిమా సైన్ చేసాడనగానే అంతా ఆశ్చర్యపోయారు. తన గత ఫ్లాఫులను కూడా మరిపించే కథ చెప్పి ఉంటాడని అంతా భావించారు. దానికి తగ్గట్లే ప్రోమోలు, పోస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఇంతకీ వారి అంచనాలు ఫలించాయో లేదో మరి కొద్ది గంటల్లో తేలనుంది.

    ఎన్నారై అభిరామ్(రామ్ చరణ్)కి చిన్నప్పటి నుంచి భారతీయ సంప్రదాయాలంటే మక్కువ. తన తండ్రి ద్వారా తన కుటుంబం విడిపోయిన తీరు తెలుసుకుని, దాన్ని సరిచేసి తన తండ్రి కళ్లల్లో ఆనందం చూడటానికి ఇండియా వస్తాడు. అక్కడ తన తాత బాలరాజు(ప్రకాష్ రాజ్) అనే గ్రామ పెద్ద కి తనెవరో చెప్పకుండా ఆ కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. తన బాబాయ్ (శ్రీకాంత్) ని కలిసి అతని ప్రేమ సమస్యను తీరుస్తాడు. తన మనవడు అని తెలిసాక బాలరాజు ఎలా స్పందిచాడు. ఎలా తన కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చి కుటుంబాన్ని ఒకటి చేసాడు అనేది మిగతా కథ.

    Ram Charan's Govindudu Andarivadele preview

    రామ్ చరణ్ ఈ చిత్రంపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఖచ్చితంగా హిట్ కొట్టి...హీరోలకు ఎనిమిద సినిమా గండం అనేది కాకతాళీయమే అని నిరూపించాలనుకుంటున్నా అని చెప్తున్నారు. అలాగే నిర్మాత సైతం 50 వరకూ ఈ చిత్రం కలెక్టు చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. దర్శకుడు సరేసరి...తన కెరీర్ లో మరో మురారి వంటి హిట్ అవుతుందని మొదటి నుంచీ అంటున్నారు. వీరిందరి అంచనాలు ఏ మేరకు ఈ సినిమా జస్టిఫై చేస్తుందో చూడాలి.


    బ్యానర్: పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్
    నటీనటులు : రామ్ చరణ్, కాజల్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు
    కెమెరా: సమీర్ రెడ్డి,
    సంగీతం: యువన్‌శంకర్‌రాజా,
    ఆర్ట్: అశోక్‌కుమార్,
    ఎడిటింగ్: నవీన్,
    ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్,
    రచన: పరుచూరి బ్రదర్స్,
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ
    నిర్మాత : బండ్ల గణేష్
    విడుదల తేదీ : అక్టోబర్ 1. 2014

    English summary
    Ram Charan’s ‘Govindudu Andarivadele’ garnered huge buzz at the moment. Say it due to the vibrant visuals, terrific song videos or the haunting cultural feel that director Krishna Vamsi imparted with his powerful conceiving of scenes, GAV is the star at the moment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X