twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ రోజే 'మెగా'భిమానులకు విందు

    By Srikanya
    |

    తన కుమారుడు వివాహ వేడుకల్లో భాగంగా మెగాస్టార్ తన 'మెగా'భిమానులకు ఈ రోజు విందు ఇస్తున్నారు. వివాహం జరిగిన వ్యవసాయ క్షేత్రంలోనే శుక్రవారం విందు ఏర్పాట్లు చేశారు. కొత్త దంపతులతో పాటు, మెగాస్టార్ కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి విందు జరగనున్నది. ఈ సందర్భంగా అభిమానులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఈ వేడుక కోసం అభిమానులకు పాసులు జారీ చేశారు. ఆ పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. సుమారు 5 వేల మంది ఈ విందుకు వస్తారని అంచనా.


    నాగబాబు ఈ విందు విషయమై మాట్లాడుతూ.. పెళ్లి జరిగే ఫామ్ హౌస్‌లోనే ఈ నెల 15వ తేదీన అభిమానుల కోసం ప్రత్యేకవిందు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఈ విందుకు అందుబాటులో ఉన్న ఐదువేలమంది అభిమానులకు ఆహ్వానపత్రికలు అందచేశామని, ఆహ్వానాలు ఉన్నవారే ఆ కార్యక్రమానికి రావాలని కోరారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అభిమానులను ఫామ్‌హౌస్‌కు చేర్చేందుకు వివిధ ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. భద్రాచలం, తిరుపతి నుంచి వచ్చిన పలువురు అభిమానులు ముత్యాల తలంబ్రాలు, పెళ్లి బట్టలు తీసుకువచ్చి నాగేంద్రబాబుకు అందజేశారు.

    వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 8 గంటల 29 నిమిషాలకు వధువు ఉపాసన శిరస్సున జీలకర్ర బెల్లం ఉంచారు చరణ్‌. వధువు తల్లిదం డ్రులు అనిల్‌ కామినేని, శోభనారెడ్డి వరుడు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. చిరంజీవి, సురేఖ దంపతుల సమక్షంలో సరిగ్గా 9 గంటలకు మగధీరుడు ఉపాసన మెడలో మూడుముళ్లు వేశారు. పురోహితులు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించి సప్తపది, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతలు వంటి కార్యక్రమాల్ని జరిపారు.

    ఇక గురువారం రాత్రి హైటెక్స్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రామ్ చరణ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. రిసెస్షన్‌కు స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దంపతులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు నాగార్జున దంపతులు, మహేష్‌బాబు దంపతులు, ప్రభాస్, పూరి జగన్నాథ్ దంపతులు, జయప్రద, బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు హాజరయ్యారు.

    English summary
    Ram Charan has entered matrimony with Upasana Kamineni June 14 at 7.30 am at the Temple Tress farm house. Charan and Upasana took their wedding wows as per the Hindu tradition in the presence of their families, friends and relatives in a specially designed Kalyana Mandapam, which resembled Domakonda fort. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X