»   » ఆశ్చర్యపరిచే వార్త :ఆ ముగ్గురు డైరక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్

ఆశ్చర్యపరిచే వార్త :ఆ ముగ్గురు డైరక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ధృవ' రేపు ఈ పాటకి థియేటర్లలో హంగామా చేస్తూంటూంది. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఆ ముగ్గురు దర్శకులు ఎవరనేదేగా మీ ఆసక్తి, చెప్తున్నాం. విని ఆశ్చర్యపోవద్దు.
ఆ దర్శకులలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకొని జనవరి రెండవ వారంలో సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధం అయింది.
సుకుమార్ సినిమాతో పాటు ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన మణిరత్నంతో ఓ ద్విభాషా చిత్రం విషయమై చరణ్ చర్చలు జరుపుతున్నారు.

ప్రస్తుతం మణిరత్నంతో స్క్రిప్ట్ విషయమై చర్చలు జరుగుతున్నాయని రామ్ చరణ్ స్వయంగా తెలిపారు. ఇక ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేసేందుకు చరణ్ స్ట్రోరీ లైన్ ని ఓకే చేసారు. అయితే ఈ ప్రాజెక్టుకి ఇంకా టైమ్ పడుతుందట. ప్రస్తుతానికి సుకుమార్, మణిరత్నం సినిమాలు మాత్రం తప్పకుండా ఉంటాయని చెప్తోంది మెగా టీమ్.

Ram Charan’s next 3 movies details

రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'ధృవ' ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తువా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. చరణ్ చివరి రెండు సినిమాలు పరాజయాలు కావడంతో ఈ సినిమా భారీ విజయం సాధించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. పైగా చరణ్ సినిమా థియేటర్లోకి వచ్చి ఏడాది కావడంతో సినిమాకి భారీ హంగామా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే 'ధృవ' రిలీజ్ రోజున మెగా అభిమానులకు థియేటర్లో చరణ్ సినిమానే కాకుండా మరో కానుక కూడా ఉంది.అదే మెగాస్టార్ 'ఖైధీ నెం 150' సినిమా టీజర్. ఈ టీజర్ ను రేపు రిలీజ్ చేసి 9న 'ధృవ' ప్రదర్శించబోయే ప్రతి థియేటర్లో సినిమాకి ముందు వేయనున్నారు.

ఇలా చరణ్ హీరో సినిమాకి ముందు చిరు సినిమా టీజర్ ప్లే చేయడం వలన మెగా అభిమానులకు థియేటర్లో సుమారు మూడు గంటల సేపు పండుగ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ టీజర్ వలన 'ధృవ' సినిమాకి కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశముంది. ఎందుకంటే మెగాస్టార్ టీజర్ ప్లస్ మెగాపవర్ స్టార్ సినిమా రెండూ కాంబోలా అభిమానులకు కనువిందు చేయడమే.

English summary
Ram Charan will be doing a film with star director Sukumar. Latest update reveals that the project will go on floors in the second week of January 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu