»   » ఎన్టీఆర్ తో రామ్ చరణ్ క్లాష్

ఎన్టీఆర్ తో రామ్ చరణ్ క్లాష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తాజా చిత్రం తని ఒరువన్ రీమేక్ రిలీజ్ డేట్ ని 16, ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించి, ఆగస్టు 12 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ముందే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయటం వల్ల మిగతా సినిమాలతో క్లాష్ లేదని భావించి ఇలా ప్రారంభానికి ముందే రిలీజ్ డేట్ ప్రకటించి అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేసి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తూంటాడు.

అయితే ఇలా అనుకున్న తేదీకి రామ్ చరణ్ తన చిత్రం రిలీజ్ చేస్తే..ఎన్టీఆర్ తో క్లాష్ తప్పేటట్లు లేదని అంటున్నారు. ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్... ఆగస్టు 12న విడుదల చేయాలని ప్రకటించారు. వారు ఆల్రెడీ రిలీజ్ డేట్ ముందే ప్రకటించి ఉండటంతో వారు మార్చుకునేటట్లు కనపడటం లేదు. దాంతో రామ్ చరణ్ ఇప్పుడు ఏం చేయనున్నారనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ ...జనతా గ్యారేజ్ చిత్రానికి కొరటాల శివ డైరక్షన్ చేస్తున్నారు.

తంలో రామ్ చరణ్ బ్రూస్ లీ చిత్రం రిలీజ్ డేట్ ముందు ప్రకటించి అనుకున్న సమయానికి రిలీజ్ చేసారు. తాజాగా తన తర్వాతి సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. ‘థాని ఒరువన్' రీమేక్ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదలయ్యేలా పక్కా ప్లానింగుతో షెడ్యూల్ తయారు చేసినట్లు తెలుస్తోంది.

Ram Charan's Thani Oruvan Remake To Clash With NTR's Janatha Garage

జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాని ఒరువన్' చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి హైలెట్ అయ్యాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. రామ్ చరణ్ ఈ మూవీలో పోలీస్ పాత్రలో నటించబోతున్నాడు. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా అరవింద స్వామి క్రిమినల్ సైంటిస్టుగా నటిస్తున్నాడు.

తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘రక్షక్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. శృతి హాసన్, లేదా ఇలియానాను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. తెలుగులో నటించడానికి అరవింద స్వామి రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట.

English summary
However, this time, if things go as per the plans, Ram Charan's next will have to battle it out with NTR's Janatha Garage, which is being shaped up in the direction of Koratala Siva. Since Mythri Movie Makers have already announced that they are working towards releasing the film on 12 August, it is obvious that Ram Charan will lock horns with NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu