twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ‘ధృవ’ టాక్ ఏంటి? ఆ ఒక్క విషయంలోనే నిరాశ, సినిమా స్ట్రెంత్ అదే

    రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘ధృవ’ . ఈ చిత్రం ఈ రోజు రిలీజయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.

    By Srikanya
    |

    హైదరాబాద్‌: 'అందరు వార్తల్లోని లైన్స్‌ చదువుతారు. ఏం రాస్తే అదే నమ్ముతారు. కానీ నేను ఈ లైన్స్‌ మధ్య ఏముందా అని ఆలోచించాను. సడెన్‌గా ఓ రోజు ఈ న్యూస్‌పేపర్‌ చదువుతుంటే.. రెండో పేజీకి, ఆరో పేజికి లింక్‌ ఉందని అర్థమైంది... ప్రజల తలరాతల్ని నిర్ణయించేది ఓ రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుడి తల రాతల్ని నిర్ణయించేది ఓ బిజినెస్‌ మాన్‌' అంటూ రామ్‌చరణ్‌ ఈ రోజు వచ్చేసాడు.

    రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన 'ధృవ' .తమిళంలో విజయం సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, అరవింద్‌స్వామి, నవదీప్‌ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు 'ధృవ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ఇప్పటికే ఈ చిత్రం షోలు పడ్డాయి. ఎన్నో అంచనాలుతో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం వాటిని రీచ్ అవుతుందా...సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉంది. సినిమా ఏ మేరకు రికార్డ్ లు క్రియేట్ చేసే అవకాసం ఉంది. చరణ్ హార్డ్ వర్క్ పే ఆఫ్ అవుతుందా వంటి విషయాలు చూద్దాం.

    క్రిమినల్ సైంటిస్ట్ తో ..

    క్రిమినల్ సైంటిస్ట్ తో ..

    ధృవ (రామ్‌చరణ్‌) ఓ యంగ్ పోలీస్ ఆపీసర్. ఎవరిని కొడితే వందమంది క్రిమినల్స్‌ అంతం అవుతారో అతడినే తన లక్ష్యంగా చేసుకొంటాడు. ఆ లక్ష్యం చేరుకొనే క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలు ఎలాంటివి? ఆ ప్రయాణంలో ఎదురైన సిద్ధార్థ్‌ అభిమన్యు (అరవింద్‌ స్వామి) ఎవరు? ఫోరెన్సిక్‌ నిపుణురాలైన ఇషిక(రకుల్‌ప్రీత్‌ సింగ్‌)తో ధృవకి ఎలా పరిచయం ఏర్పడింది? ఆ పరిచయం ఎక్కడిదాకా వెళ్లింది? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.

    టాక్ ఏంటి

    టాక్ ఏంటి

    ఇప్పటికే సినిమా చూసిన వారు చెప్పే టాక్ ఏమిటి అంటే.. సినిమా టెక్నికల్ గా వెరీ స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెట్టించాయి. అలాగే స్లీక్ విజువల్స్ తో సినిమా మొత్తం అరిపించాడు. సురేంద్రరెడ్డి ఆ విషయంలో హై సక్సెస్.

    నార్మల్ గా ఉంది

    నార్మల్ గా ఉంది

    అయితే ధృవ, సిద్దార్ద (అరవింద్ స్వామి) మధ్యన మైండ్ గ్రైమ్ క్రియేటివ్ గా ఉండాలని ఎక్సపెక్ట్ చేస్తే మాత్రం కొద్దిగా నిరాశపరడారు. మైండ్ గేమ్ చెప్పుకోదనంద కొత్తగా, సృజనాత్మకంగా లేదు. డివైజ్ తో ప్లే చేసిన ట్రిక్స్ చాలా నార్మల్ గా అనిపించాయి.

    రేసీగా..

    రేసీగా..

    కానీ సినిమా కు హైలెట్ ఏమిటి అంటే రేసీ స్క్రీన్ ప్లే. ఇంటర్వెల్ తర్వాత ఓ అరగంట సేపు ఉన్న పార్ట్ లాగ్ ని మినహాయిస్తే సినిమా రాకెట్ వేగంతో సాగుతుంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా డిఫెరెంట్ గా ఉన్నాయి. కమర్షియల్ గా సినిమా రేంజి ఏంటనేది..ఆ ఎలిమెంట్స్ ని ప్రేక్షకులు ఏ స్దాయిలో రిసీవ్ చేసుకుంటారనేదే.

    చరణ్ కష్టం కనిపించింది

    చరణ్ కష్టం కనిపించింది

    సినిమా కోసం రామ్ చరణ్ తన శరీరంలో తీసుకువచ్చిన మార్పులు అబ్బురపరుస్తాయి. ఓ స్ట్రాంగ్ పోలీస్ అదికారిగా చేసుకున్న మేకోవర్ సూపర్బ్ అనిపిస్తుంది. చరణ్ కష్టం ఖచ్చితంగా పే ఆఫ్ అవ్వాలి. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే ... హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి.

    కొద్దిగా స్లో

    కొద్దిగా స్లో

    ఈ సినిమా ఫస్టాఫ్ కొద్దిగా స్లో ఉంది. అలాగే రొమాంటిక్ సీన్స్ , లవ్ స్టోరీ రామ్ చరణ్, రకుల్ మధ్య గొప్పగా లేదు. ఎంటర్టైన్మంట్ లేదు. మొదటి నుంచి ఇంటర్వెల్ దాకా సీరియస్ మోడ్ లో నడిచింది. కేవలం అరవింద్ స్వామి సీన్స్ మాత్రమే ఫస్టాఫ్ ని పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఇంటర్వెల్ కు లీడ్ చేసే సీన్స్ ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. దాదాపు ఫస్టాఫ్ మొత్తం ఒరిజనల్ ను కట్ అండ్ పేస్ట్ గా ఉంది. ఫస్టాఫ్ జస్ట్ ఓకే, యావరేజ్.

    పెద్ద మార్పులు లేవు కానీ

    పెద్ద మార్పులు లేవు కానీ

    సెకండాఫ్ ...తొలి భాగం కన్నా రేసీగా సాగింది. చాలా బాగుంది. అయితే మాతృత తని ఒరువన్ నుంచి పెద్ద దూరంగా వెళ్లలేదు. చాలా సీన్స్ ...ఒరిజనల్ లో ఉన్నవే తీసుకున్నారు. అరవింద్ స్వామి అదరకొట్టాడు. ఆయన్ని తీసుకోవటమే బెస్ట్ ఛాయిస్ అని అర్దమవుతుంది.

    సురేంద్రరెడ్డి నిరాశపరిచాడు

    సురేంద్రరెడ్డి నిరాశపరిచాడు

    ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ రేసీగా బాగుంది. సినిమా అంతా సీరియస్ గా సాగింది. ఉన్న ఏకైక రిలీఫ్ ..పోసాని కామెడీ మాత్రమే. అరవింద్ స్వామి నటనతో నిలబెట్టేసాడు. రామ్ చరణ్ కూడా గత చిత్రాలకు భిన్నంగా చాలా బాగా చేసారు. మెచ్యూర్డ్ ఫెరఫార్మెన్స్ కనిపించింది. సురేంద్రరెడ్డి మాత్రం కాస్త నిరాశపరిచాడు. ఒరిజనల్ నుంచి పెద్దగా దూరం వెళ్లలేదు . మార్పులు చేయలేదు.

    తక్కువ బడ్జెట్ లో హై సక్సెస్

    తక్కువ బడ్జెట్ లో హై సక్సెస్

    తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్‌'కి ఇది రీమేక్‌. రూ.20 కోట్ల వ్యయంతో తెరకెక్కి రూ.వంద కోట్లు వసూలు చేసి తమిళ సిని పరిశ్రమని ఆశ్చర్యపరిచింది ‘తని ఒరువన్‌'. సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన తొలి రీమేక్‌ సినిమా ఇదే.

    ఫిటెనెస్ నిపుణులతో ..

    ఫిటెనెస్ నిపుణులతో ..

    రామ్‌చరణ్‌ తొలిసారి సిక్స్‌ప్యాక్‌ బాడీతో కనిపిస్తాడు. సినిమా మొదలు పెట్టడానికి ముందు ఆయన థాయ్‌లాండ్‌ వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకొచ్చారు. బాలీవుడ్‌కి చెందిన ఫిట్‌నెస్‌ నిపుణుల సమక్షంలో ఆయన ఈ సినిమా కోసం సన్నద్ధమయ్యారు. కశ్మీర్‌లో కొన్ని పాటలతో పాటు కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ‘మగధీర' తర్వాత గీతా ఆర్ట్స్‌లో రామ్‌చరణ్‌ నటించిన చిత్రమిదే.

    సురేందర్‌రెడ్డి ఏమంటారంటే..

    సురేందర్‌రెడ్డి ఏమంటారంటే..

    ‘ధృవ' గురించి దర్శకుడు సురేందర్‌ రెడ్డి మాట్లడుతూ ‘‘స్వతహాగా నాకు రీమేక్‌ అంటే ఇష్టం ఉండదు. కానీ ‘తనిఒరువన్‌' కథాంశం బాగా నచ్చింది. ఆ కథని నా మెదడులోకీ, మనసులోకీ ఎక్కించుకోవడానికి కొంత సమయం పట్టింది. తమిళంలో ప్లస్సుల్ని ఇంకా బాగా తెరపై చూపించడానికి, మైనస్‌లను ప్లస్‌లుగా మార్చడానికి ప్రయత్నిచాం. రామ్‌చరణ్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పేరుకు తగ్గట్టే నడిచొచ్చే నక్షత్రంలా ఉంటాడు రామ్‌చరణ్‌. సిక్స్‌ప్యాక్‌ చేయడమే కాదు, దాన్ని నెలలపాటు కాపాడుకొంటూ నటించారు.

    మార్పులేమీ చెయ్యలేదు

    మార్పులేమీ చెయ్యలేదు

    సినిమాకి రామ్‌చరణ్‌, అరవింద్‌ స్వామి పాత్రలు కీలకం. మాతృకలోలాగే వాటిని ఎంతో పకడ్బందీగా తెరకెక్కించాం. కథ పరంగా పెద్దగా మార్పులేమీ చేయలేదు. అయితే ‘ధృవ' టైటిల్‌లో కనిపించే 8 అంకె సినిమాకి ప్రత్యేకం. మాతృకలో లేనిదీ మా ధృవలో ఉన్నదీ అదొక్కటే'' అన్నారు.

    రామ్ చరణ్ మాట్లాడుతూ..

    రామ్ చరణ్ మాట్లాడుతూ..

    ‘‘సురేందర్‌రెడ్డితో ఓ సినిమా చేయాలనుకొన్నా. ఆ సమయంలోనే ‘తనిఒరువన్‌' వచ్చింది. కథ, అందులోని పాత్రలు నాకు బాగా నచ్చాయి. ఈ సినిమాకి రీమేక్‌ ఎందుకు చేయకూడదు? ఇంత మంచి కథ తెలుగు ప్రేక్షకులకు ఎందుకు చూపించకూడదు? అనిపించింది. అందుకే రీమేక్‌ చేయాలనుకొన్నాం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు అక్కడక్కడ కొన్ని మార్పులుంటాయంతే. ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. కొత్తగా ఉంటుంది అన్నారు రామ్ చరణ్.

    కడుపు మార్చుకోలేదు

    కడుపు మార్చుకోలేదు

    అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు మనమూ చేయాలి. కథ డిమాండ్‌ చేసిందనే సిక్స్‌ప్యాక్‌ చేశా. అందుకోసం నేను చాలా కష్టపడ్డానని అంతా అంటున్నారు. నిజానికి ప్రతి సినిమాకీ ఇలాంటి కష్టాలుంటాయి. సిక్స్‌ప్యాక్‌ కోసం కడుపు ఏం మాడ్చుకోలేదు. ఇష్టమైనవన్నీ తిన్నా అన్నారు రామ్ చరణ్

    ఆశ్చర్యం అనిపించింది

    ఆశ్చర్యం అనిపించింది

    ‘ధృవ'లో అరవింద్‌ స్వామిగారి పాత్రంటే నాకు చాలా ఇష్టం. ఆయన తప్ప ఆ పాత్ర ఇంకెవ్వరూ చేయలేరు అనిపించే ఆయన్ని తీసుకొన్నాం. రకుల్‌తో ఇది నా రెండో సినిమా. తను మంచి నటి. చాలా కష్టపడుతుంది. ఈ సినిమాలో ‘పరేషానురా..' పాటకు తనే ప్రత్యేక ఆకర్షణ. హిప్‌ హాప్‌ మంచి పాటల్ని అందించాడు. పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఆ స్థాయిలో సంగీతం అందించడం ఆశ్చర్యపరిచింది. ఇదేదో క్లాస్‌, మల్టీప్లెక్స్‌ సినిమా అనుకోవొద్దు. మాస్‌కీ నచ్చుతుంది''అన్నారు చరణ్‌.

    చిత్రం టీమ్ ఇదే

    చిత్రం టీమ్ ఇదే

    చిత్రం: ధృవ, తారాగణం: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, అరవింద్‌ స్వామి, పోసాని కృష్ణమురళి, నాజర్‌, నవదీప్‌ తదితరులు.
    సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ,
    కళ: నాగేంద్ర,
    ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌,
    కూర్పు: నవీన్‌ నూలి,
    నిర్మాతలు: అల్లు అరవింద్‌, ఎన్‌.వి.ప్రసాద్‌,
    దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.
    నిడివి: 2 గంటల 39 నిమిషాలు
    విడుదల: 9, నవంబర్ 2016.

    English summary
    For Ram Charan Dhruva film is better than his previous entertainer and over all Dhruva turns out to be average to hit film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X