»   »  వెనక్కి తగ్గని రామ్ చరణ్..విడుదల తేదీ మారదు

వెనక్కి తగ్గని రామ్ చరణ్..విడుదల తేదీ మారదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో పెద్ద సినిమాలు విడుదల సమస్య ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామ్ చరణ్ చిత్రానికి నైజాం వరకూ హ్యాపీనే కానీ, ఆంధ్రా, సీడెడ్‌ల్లో తమ సినిమాలను విడుదల చేయనిస్తారా లేదా అనే డైలమా ఉంది. ముఖ్యంగా 'తుఫాన్' సినిమాల విషయంలోనే ఈ సందిగ్ధావస్థ. ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించిన ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే రిలీజ్ తేదీలో మార్పేమీ లేదని సమాచారం. నిర్మాతలు ఎట్టిపరిస్ధితులోలనూ మొదట అనుకున్న తేదీకే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


'రచ్చ', 'నాయక్‌'లతో వరుస విజయాలను అందుకొన్నారు రామ్‌చరణ్‌. ఇప్పుడు హ్యాట్రిక్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన బాలీవుడ్‌ చిత్రం 'జంజీర్‌'. తెలుగులో 'తుఫాన్‌'గా వస్తోంది. ప్రియాంకా చోప్రా హీరోయిన్. అపూర్వ లాఖియా దర్శకుడు. శ్రీహరి, తనికెళ్లభరిణి, దేవ్‌గిల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పునీత్‌ ప్రకాష్‌మెహ్రా, సుమిత్‌ ప్రకాష్‌ మెహ్రా, ఫ్త్లెయింగ్‌ టర్టిల్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.


అలేగా క్రేజ్ కు తగ్గట్టుగానే బిజినెస్ డీలింగ్స్ పూర్తి చేశారు. పబ్లిసిటీని కూడా పక్కాగా ప్లాన్ చేసేశారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఈ చిత్రం ఆంధ్రా, సీడెడ్‌ల్లో విడుదలయ్యే అవకాశం ఉంటుందా అనే సందేహం అందరిలోనూ ముసురుకుంది. ఈ చిత్రంలోని పాటల్ని ఈనెల 27న హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 6న 'తుఫాన్‌' విడుదల కానుంది. ''ఆయిల్‌ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రం ఇది. నిజాయతీగల పోలీస్‌ అధికారి పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకొంటాయి. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలు ప్రధాన ఆకర్షణ'' అని యూనిట్ చెబుతోంది.

అలాగని డేట్ వాయిదా వేస్తే, మొత్తం నేషనల్ మార్కెట్, ఓవర్‌సీస్ మార్కెట్‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 6న విడుదల చేయాలని నిర్మాతలు నిశ్చయించినట్టుగా ఫిలిమ్‌నగర్ సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఏరియాల బిజినెస్‌ని పూర్తి చేసేశారు. ఈ నెల 27న వైభవంగా హైదరాబాద్‌లో 'తుఫాన్' ఆడియో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనా రామ్‌చరణ్ కెరీర్‌లో ఈ సినిమా ఓ కీలకాంశం కానుంది.

English summary
Supporters of the Samaikhyandhra and Telangana movements are gearing up for a showdown in Hyderabad on September 7th. This might lead to some tension in the city on that day, as both parties are firm on showcasing their might. Amidst all this, what will happen to Mega Power Star Ram Charan’s ‘Thoofan’? The movie is slated for a release on September 6th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu