»   » చిన్న సినిమాలకు రామ్ చరణ్ చేయూత...కొత్త బ్యానర్

చిన్న సినిమాలకు రామ్ చరణ్ చేయూత...కొత్త బ్యానర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తన తండ్రి చిరంజీవి 150 వ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న చరణ్....చిన్న సినిమాలకు చేయూత నివ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయన వైట్ హార్స్ ఎంటర్ టైన్మెంట్స్ అనే బ్యానర్ ను మొదలెట్టారు. ఈ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బ్యానర్ పై 5 కోట్ల లోపు బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించనున్నారు. ఈ మేరకు త్వరలోనే ప్రకటన రానుందని సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


రామ్ చరణ్ హీరోగానే గాక నిర్మాణ రంగంలోనూ తన మార్క్ చూపించాలనుకుంటున్నారు. అందుకే ఒకేసారి రెండు నిర్మాణ సంస్థలను స్థాపించి నిర్మాణం రంగంలోనూ హవా కొనసాగించాలనుకుంటున్నారు. చిరు రీ ఎంట్రీ సినిమాను తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కిస్తున్న చరణ్, తరువాత కూడా వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బ్యానర్ ద్వారా కొత్త నటీనటులను, దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు చరణ్.


Ram Charan’s White Horse Production House

రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్ లీ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ . ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించటం అనే వార్త, శ్రీను వైట్లతో తొలిసారి చేయటం, ఇప్పటికే వదిలిన ట్రైలర్స్ సినిమా బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయేలా చేసాయి. దాంతో ఈ చిత్రం అన్ని ఏరియాలు అమ్ముడయ్యి...పదికోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.


రకుల్ ప్రీతి మాట్లాడుతూ... 'రామ్‌చరణ్‌ లాంటి పెద్ద హీరోతో తొలిసారి నటించా. ఈ సినిమాలో చాలా గ్లామర్‌గా కనబడ్డానని అందరూ అంటున్నారు. నా లుక్‌ కోసం దర్శకుడు శ్రీనువైట్ల చాలా కష్టపడ్డారు. చరణ్‌తో డ్యాన్స్‌ చేయడం చాలా కష్టం. సాంగ్‌ షూటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే సాధన చేసేదాన్ని. ఈ విషయంలో చెర్రీ అన్ని విధాలా సహకరించేవాడు' అని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. తన తాజా చిత్రం 'బ్రూస్‌లీ'లో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి తెరను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆ చిత్ర హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు.


రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
It is great news for Ram Charan fans to witness their Hero to start minting movies between 3-5 Cr of budget under White Horse Production Banner. Besides working in films Ram Charan is curious in producing films. So now, he owns two production houses, Konidela Production House for big budget movies and White Horse productions for small budget movies.
Please Wait while comments are loading...