»   » ఎంటర్టైనర్ గా వచ్చాడు ( 'ఎవడు' ప్రివ్యూ)

ఎంటర్టైనర్ గా వచ్చాడు ( 'ఎవడు' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎంతో కాలంగా రామ్‌చరణ్‌ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం 'ఎవడు' ఈ రోజు భారీ ఎత్తున సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి నటించటం, దిల్ రాజు వంటి మెగా నిర్మాత ప్రొడ్యూస్ చేసిన చిత్రం కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. థ్రిల్ కలిగించే విషయాలతో పాటు ఎంటర్టైన్మెంట్ గానూ చిత్రం సాగుతుందని దర్శకుడు చెప్తున్నారు.

వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో... సత్య(అల్లు అర్జున్)ని చంపాలని వీరూభాయ్(రాహుల్ దేవ్) చంపాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రాసెస్ లో ఉండగా...వీరూభాయ్ మనుషులను ఊహించని విధంగా అసలు పరిచయం లేని చరణ్(రామ్ చరణ్) చంపటం మొదలెడతాడు. వీరూభాయ్ కి తనని చరణ్ ఎందుకు చంపటానికి తిరుగుతున్నాడో అర్దం కాదు. సత్య ఏమయ్యాడు...చరణ్ ఎందుకు వీరూభాయ్ వెనకపడుతున్నాడు వంటి అంశాలతో కథ నడుస్తుంది.

Ram Charan’s ‘Yevadu’ Preview

దిల్ రాజు మాట్లాడుతూ...మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ఎవడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, శ్రుతి హాసన్, అమి జాక్సన్ అందాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ,దర్శకుడు వంశీ పైడిపల్లి సూపర్బ్ టేకింగ్, ఈ చిత్రానికి హైలెట్స్ కాగా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ పాత్రలు హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రం మెగా అభిమానులకు పండుగ వాతావరణం కల్పించటమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యథిక థియోటర్స్ లో విడుదల అవుతోంది అన్నారు.


నటీనటులు: రామ్ చరణ్, అల్లు అర్జున్, అమీ జాక్సన్, కాజల్, శృతి హాసన్, జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,
కథ: వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ,
మాటలు: అబ్బూరి రవి,
కథ సహకారం: హరి,
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
యాక్షన్ : సెల్వం,
ఆర్ట్: ఆనంద్ సాయి,
సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్,
నిర్మాత: దిల్ రాజు,
దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

English summary

 Yevadu, the much awaited movie of Ram Charan is releasing Today. Shruti Hassan is paired with Ram Charan. The movie is said to be an action thriller. Vamshi Paidipalli is the director and Dil Raju is the producer. Though the release of the movie is delayed, fans are eagerly waiting for the film. Dialogues of the movie are created high expectations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more