»   » కేవలం అల్లు అర్జున్ క్రేజ్ తోనే 'ఎవడు' రిలీజ్

కేవలం అల్లు అర్జున్ క్రేజ్ తోనే 'ఎవడు' రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మలయాళంలో బన్నికి మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు అందరు హీరోలు తమ దృష్టిని మలయాళంపై పెట్టారు. అక్కడ కూడా తమ సినిమా రిలీజై హిట్ కావాలనుకోరుకుంటున్నారు. అయితే ఎవరూ అంత సక్సెస్ కాలేదు. అయితే అల్లు అర్జున్ గెస్ట్ గా చేసినా సరే అక్కడ బ్రహ్మరధం పడతారనే నమ్మకం ఉంది. దాంతో కేవలం అల్లు అర్జున్ పై క్రేజ్ తో 'ఎవడు' చిత్రాన్ని మలయాళంలో అదే రోజు భారీగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. డిసెంబర్ 19న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''అన్ని కార్యక్రమాలనూ ముగించుకొందీ చిత్రం. రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాని అనుకొన్న సమయంలో తీసుకురాలేకపోయాం. డిసెంబరు 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మలయాళంలోనూ విడుదల చేయాలనుకొంటున్నాం. రామ్‌చరణ్‌ కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా మిగిలిపోనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బాణీలు ఆకట్టుకొంటున్నాయి. అల్లు అర్జున్‌ కనిపించేది పది నిమిషాలే అయినా.. ఆయన పోషించిన పాత్ర గుర్తుండిపోతుంది'' అన్నారు.

యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే.. శాంతి మంత్రం జపిస్తే కుదరదు. ప్రాణాలు పోయినా, లక్ష్యాన్ని సాధిస్తే అందులో ఉన్న తృప్తి పేరు. ఆ యువకుడి భావాలు ఇలానే ఉంటాయ్‌. సుదూర ప్రయాణాన్ని ఒక్కడే మొదలెట్టాడు. ఒక్కడే పూర్తి చేశాడు. ఇంతకీ అతనెవరు? ఆ ప్రయాణం ఎందుకోసం? ఈ విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు వంశీ పైడిపల్లి.

రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కించిన చిత్రం ఇది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితుల నేపత్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు 'ఎవడు' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్ : సెల్వం, ఆర్ట్: ఆనంద్ సాయి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

English summary
Ram Charan’s ‘Yevadu’ will hit the screens on December 19th. Vamsi Paidipally is the director of this movie and Dil Raju is the producer. The movie has Shruti Haasan and Amy Jackson in lead roles opposite Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu