»   »  'ఎవడు' సినిమా ఆఫీసులో పెట్టుకుని...

'ఎవడు' సినిమా ఆఫీసులో పెట్టుకుని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఎవడు' అనే సినిమాను పూర్తయినా కూడా ఆఫీసులోనే పెట్టుకుని ఏ నిర్మాతకు అనుభవంలో లేని అంశాలను అనుభవిస్తున్నాను. ఈ సినిమాను తప్పనిసరిగా 2013లోనే విడుదల చేస్తాం. దీపావళికిగానీ, క్రిస్‌మస్‌కు గానీ విడుదల చేస్తాం. ఏ హీరో కూడా విడుదల తేదీల విషయాల్లో నామీద ఒత్తిడి పెట్టలేదు. నాకు స్వేచ్ఛనిచ్చి నాకు పూర్తిగా సహకరించారు. అని నిర్మాత దిల్ రాజు అన్నారు.

అలాగే "రామ్‌చరణ్ 'ఎవడు' సినిమాను జులై 31న విడుదల చేద్దామనే ఉద్దేశంతో సెన్సార్ పూర్తి చేసి రెడీ చేశాం. అప్పుడు 'అత్తారింటికి దారేది' ఉండటంతో ఆగాం. తర్వాత ఆగస్ట్ 21న విడుదల చేద్దామని కూడా అనుకున్నాం. కానీ రాష్ట్రంలోని పరిస్థితుల వల్ల ఆపాల్సి వచ్చింది. అక్టోబర్ 10న 'ఎవడు'నే తెద్దామనుకున్నాం. కానీ హీరోలతో మాట్లాడిన తర్వాతే ముందు 'రామయ్యా వస్తావయ్యా'ను విడుదల చేసి, తర్వాత 'ఎవడు'ను తెద్దామని నిర్ణయించుకున్నాం అన్నారు దిల్ రాజు.


శృతిహాసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దిల్‌ రాజు మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. చరణ్‌ నటన, నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు''అన్నారు.

చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్‌, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, కూర్పు: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

English summary
Ram Charan’s most awaited film Yevadu release date has been finally confirmed. This film is going to hit the screens this year during Diwali or Christmas. Producer Dil Raju confirmed the news. The movie is expected to a stylish action thriller. Shruti Haasan and Amy Jackson are playing female lead roles. Allu Arjun and Kajal Aggarwal will be making cameo appearances in the film. music dare devil Devi Sri Prasad is scoring music and Vakkantham Vamsi penned the script for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu