Just In
- 8 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 9 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 10 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 11 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘జంజీర్/తుపాన్’ మూవీ టాక్ ఏంటి?
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' రేపు(సెప్టెంబర్ 6న)గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు వెర్షన్ 'తుఫాన్' పేరుతో విడుదలవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియర్ షోను పలువురు ప్రముఖులు, క్రిటిక్స్ కోసం ప్రదర్శించారు.
ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్, సుభాష్ కె ఝా లాంటి వారు 'జంజీర్' చిత్రాన్ని ఇప్పటికే వీక్షించారు. చరణ్ పెర్పార్మెన్స్ అద్భుతంగా ఉందని పొగడ్తలు గుప్పించారు. జంజీర్‌లో రామ్ చరణ్ పవర్ ఫుల్ యాక్షన్ సినిమాకు హైలెట్‌గా ఉందని, తప్పకుండా సినిమా మంచి ఫలితాలను సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు.
క్రిటిక్స్ నుంచి ప్రశంసలు రావడంతో మెగా ఫ్యామిలీ అంతా సినిమా ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు సాయంత్రానికి సినిమా భవిష్యత్ ఏమిటో తేలనుంది. మరో వైపు అభిమానులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయితే రామ్ చరణ్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లోనూ తన హవా కొనసాగించే అవకాశం ఉంది.
తెలుగు వెర్షన్ 'తుఫాన్' విషయానికొస్తే ఈ చిత్రం నైజాం ఏరియాలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలవుతోంది. హిందీ, తెలుగు వెర్షన్ కలిపి నైజా ఏరియాలో మొత్తం 356 థియేటర్లలో విడుదలవుతోంది. ఒక్క హైదరాబాద్‌లో ఈ చిత్రం 106 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలోనూ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
రామ్ చరణ్‌కు సౌతిండియాలో ముఖ్యంగా తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉండటం, ప్రియాంక లాంటి స్టార్ హీరోయిన్ కావడం, అపూర్వ లఖియా దర్శకత్వం లాంటి అంశాల మేళవింపుతో సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తుందని ఆశిస్తున్నారు. సినిమా ఫస్ట్ డే టాక్, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
1975లో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏసిపీ విజయ్ ఖన్నా పాత్రలో నటించాడు. షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించగా, మోనా డార్లింగ్ పాత్రలో నటించింది. తనికెళ్ల భరణి, దేవ్ గిల్ కీలకమైన పాత్రలు పోషించారు.
రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.