twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుణశేఖర్ దే తప్పు అని తేల్చిన రామ్ చరణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన రుద్రమదేవి చిత్రం అక్టోబర్ 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగానే వీకెండ్ లలో వర్కవుట్ అవుతోంది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రం పూర్తి స్ధాయిలో ఒడ్డున పడాలంటే...రెండువారాల పాటు మరే పెద్ద సినిమాలు రంగంలోకి దిగకూడదు. అయితే రామ్ చరణ్ బ్రూస్ లీ చిత్రం ఈ కలెక్షన్స్ కు అడ్డుకట్టవేయటానికా అన్నట్లు బరిలోకి దూకుతోంది. దాంతో థియోటర్స్ నుంచి అన్ని విషయాల్లోనూ రుద్రమదేవికు సమస్య ఎదురుకానుంది.

    ram charan

    ఈ విషయమై రామ్ చరణ్ తండ్రి చిరంజీవిని ఉద్దేసిస్తూ బ్రూస్ లీ చిత్రాన్ని వాయిదా వెయ్యిమంటూ...నిర్మాత తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ఓపెన్ గా ఓ లెటర్ సైతం రాసారు. అయితే దానికేమీ స్పందన రాలేదు. కానీ రామ్ చరణ్ ఈ విషయమై స్పందించారు.

    రామ్ చరణ్ మాట్లాడుతూ..." తాను రూల్స్ ని బ్రేక్ చేయనని అన్నారు. బాహుబలి, శ్రీమంతుడు,కిక్ 2 నిర్మాతల మధ్య క్లియర్ గా అండర్ స్టాండిగ్ కుదిరిందని, అందుకే రెండు వారాల చొప్పున గ్యాప్ మెయింటైన్ చేయగలిగారు. అలాంటిదే రుద్రమదేవికు, బ్రూస్ లీ మధ్య అండర్ స్టాండింగ్ జరిగి ఉంటే బాగుండేది. నేను ఈ విషయమై బన్నీతో కూడా ప్రస్దావించాను. కానీ దరుదృష్టవశాత్తు..అలాంటి అండర్ స్టాండింగ్ ఏదీ జరగలేదు. అయితే ఈ హడావిడి మా ఇద్దరిలో ఎవరికీ ఎఫెక్టు కాదనే భావిస్తున్నాను. నెక్ట్స్ టైమ్ నుంచి... రెండు వారాల గ్యాప్ చూసుకునే సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటాము.. ఆగడు టైమ్ లో కూడా మా గోవిందుడు అందరి వాడేలా చిత్రాన్ని వారి రిక్వెస్ట్ మేరకు రెండు వారాలు ముందుకు వెళ్లాం ," అన్నారు.

    srniu vaitla

    చరణ్ మాట్లాడుతూ... బాహుబలి రిలీజ్ సమయంలో స్వయంగా శోభు యార్లగడ్డతో పాటు రాజమౌళి కూడా శ్రీమంతుడు హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివతో మాట్లాడారు. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ అయితే నష్టాలు తప్పవని, అది రెండు సినిమాలకు మంచిది కాదని వివరించారు. కానీ ఇప్పుడు రుద్రమదేవి విషయంలో తన దగ్గరకి కానీ, నిర్మాత దానయ్య దగ్గరకు కానీ ఏ నిర్మాతా రాలేదని, తమ సినిమా వాయిదా వేయమని కోరలేదని అన్నారు. ఒకవేళ గుణశేఖర్ టీం వచ్చి అడిగితే వాయిదా విషయమై ఆలోచించేవాళ్లమని అన్నారు.

    అంతేకాకుండా తమ బ్రూస్ లీ చిత్రం రిలీజ్ డేట్ ఖరారు చేసిన తర్వాతే అక్టోబర్ 9న రుద్రమదేవి, అఖిల్ చిత్రం 22 కు విడుదల తేదీలు పెట్టుకున్నారన్నాడు. తామే మొదట రిలీజ్ డేట్ అనుకున్నాం కాబట్టి తర్వాత వచ్చి డేట్స్ ఇచ్చిన వారి విషయాలు తమకు తెలియదని అన్నారు.

    English summary
    When asked about the short gap between Rudramadevi and Bruce Lee, Ram Charan clarified he announced the release date of his film long before and its the mistake of Gunasekhar to have not taken any measures to avoid such a situation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X