జైల్లో కలవటానికి రామ్‌చరణ్ కోర్టుకు దరాఖాస్తు
మామూలుగా అయితే కుటుంబ సభ్యుల్ని తప్ప సంజయ్ దత్ జైలులో ఎవర్నీ కలిసేందుకు అనుమతి లేదు. ఎవరైనా కలవాలనుకొంటే కోర్టు ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే రామ్‌చరణ్, అపూర్వ కోర్టుకు దరఖాస్తు చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు.
పాత 'జంజీర్'లో ప్రాణ్ పోషించిన షేర్ ఖాన్ పాత్రను తాజా చిత్రంలో సంజయ్ దత్ పోషించారు. సెప్టెంబరు 6న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన్ను కలవనున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఈచిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ రూ. 105 కోట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సినిమాలకు తెలుగులో దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసే స్టామినా ఉండటం, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో పాటు, హిందీ మార్కెట్లో 'జంజీర్' చిత్రం అవలీలగా 80 కోట్లపైగానే వసూలు చేసే అవకాశం ఉండటంతో వంద కోట్లకు పైగా భారీ మొత్తానికి వెచ్చింది జంజీర్ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో జంజీర్ చిత్రాన్ని 'తుఫాన్' పేరుతో, మళయాలంలో 'ముంబై కా హీరో' పేరుతో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












