»   » ఫన్నీ అంటూ రామ్ చరణ్ షేర్ చేసాడు ( నవ్వించే వీడియో)

ఫన్నీ అంటూ రామ్ చరణ్ షేర్ చేసాడు ( నవ్వించే వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొంచెం డిఫెరెంట్ గా ఆలోచించి, స్పందించే హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. ఆయన తన ఫ్యాన్స్ తో ఎప్పుడూ ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా టచ్ లో ఉండటానికి ప్రయత్నిస్తూంటారు. తాజాగా ఆయన చూసిన ఫన్ వీడియోని ఒకటి...తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసారు. ఈ వీడియో చూస్తే మీకూ నవ్వు వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి.

It's Hilarious!!! Hav a superb day!!

Posted by Ram Charan on 8 July 2015


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక రామ్ చరణ్ తాజా చిత్రం విషయానికి వస్తే...

రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Ram Charan share a funny video

దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan shared this link and said that.... It's Hilarious!!! Hav a superb day!!"
Please Wait while comments are loading...