»   » నష్టం జరుగొద్దనే: అతనికి సర్ది చెప్పిన రామ్ చరణ్!

నష్టం జరుగొద్దనే: అతనికి సర్ది చెప్పిన రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకడు శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్య ‘దూకుడు' సినిమా సమయంలో ఏర్పడిన విబేధాలతో....ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అప్పటి వరకు శ్రీను వైట్ల సినిమాలకు పని చేసిన కోన వెంకట్ ‘దూకుడు' విబేధాలతో అతనికి దూరం అయ్యాడు. అందుకు కారణం శ్రీను వైట్ల.... రచయితగా కోన వెంకట్‌కు క్రెడిట్ ఇవ్వక పోవమే. దీంతో ఆగ్రహించిన కోన అప్పట్లో బహిరంగంగానే విమర్శలు చేసారు.

ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తన సినిమాకు కోన వెంకట్ కూడా పని చేస్తే బావుంటుందని భావించిన రామ్ చరణ్ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసారు. ముందుగా దర్శకుడు శ్రీను వైట్లను ఒప్పించిన చరణ్, అనంతరం కోన వెంకట్‌కి కాల్ చేసినట్లు తెలుస్తోంది.

Ram Charan solves Srinu Vytla and Kona Venkat issue

ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న అభిప్రాయ విబేధాల వల్ల సినీ పరిశ్రమకు నష్టం జరుగ కూడదు. మీరు ఇద్దరూ కలిసి పని చేస్తేనే బావుంటుంది. ఒక సినిమా హిట్టయితే వందల కుటుంబాలకు మంచి జరుగుతుంది అని సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. కోన వెంకట్ కూడా ఇందుకు సుముఖంగా స్పందించినట్లు సమాచారం.

మరి కోన వెంకట్ ....త్వరలో శ్రీను వైట్ల-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రానికి పని చేస్తారా? లేక తర్వాత మరేదైనా సినిమా పని చేసే అవకాశం ఉందా? అనేది త్వరలోనే తేల నుంది. రామ్ చరణ్ చెబితే చిరంజీవి చెప్పినట్లే, రామ్ చరణ్ మాట కాదంటే చిరంజీవి మాట కాదన్నట్లే...అందుకే కోన వెంకట్ తప్పకుండా పాజిటివ్‌గా స్పందించే అవకాశం ఉంది అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.

English summary
Ram Charan solves Srinu Vytla and Kona Venkat issue. . Charan called up Kona and told him 'Difference of opinion between two individuals shouldn't cause damage to the Film Industry. A hit film will help 100s of families to survive'. These words have changed the mindset of Kona Venkat at last!
Please Wait while comments are loading...