twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయనతో చేస్తే ఆ కిక్కే వేరు, బాబాయ్ అన్నీ వదిలేరు, బాధగా ఉంది: రామ్ చరణ్

    |

    మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విన‌య విధేయ రామ‌. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

    రామ్ చరణ్ మాట్లాడుతూ... మా ప్రియమైన స్నేహితుడు, ఒక విజనరీ, ఒక గ్రేట్ లీడర్, తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ లవబుల్ పొలిటీషియన్ కేటీఆర్ గారికి గ్రాండ్ వెల్ కం. ఆయన్ను చూస్తుంటే, ఆయన పని చేసే తీరు చూస్తుంటే కేసీఆర్ గారి విజన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే తపన, హార్డ్ వర్క్, పబ్లిక్‌కు సర్వీస్ చేయాలనే ఉత్సాహం...వెరీ వెరీ ఇన్‌స్పైరింగ్. మా అందరి తరుపున మీరు సాధించిన ఒక గ్రేట్ విక్టరీకి కంగ్రాట్స్ చెబుతున్నాను. గతంలో కంటే ఈ సారి మీరు మరింత మెరుగైన పాలన అందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

    బాస్ అనాలా? బిగ్ బాస్ అనాలా? మెగాస్టార్ అనాలా?

    బాస్ అనాలా? బిగ్ బాస్ అనాలా? మెగాస్టార్ అనాలా?

    ఇక మెగాస్టార్ గురించి మాట్లాడితే.. ఆయన్ను బాస్ అనాలా? బిగ్ బాస్ అనాలా? మెగాస్టార్ అనాలా? లేక ముద్దుగా మీరందరూ పిలిచే అన్నయ్య అనాలో తెలియదు కానీ నాకు మాత్రం మా నాన్నగారే. సైరా షూటింగులో బిజీగా ఉండి కూడా వచ్చినందుకు ఆయనకు థాంక్స్. ఈ వేడుకకు వచ్చిన గెస్టులకు, పెద్దలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మేమంతా ఈ రోజు ఇంత ఆనందంగా, తలెత్తుకుని నిల్చున్నామంటే అందుకు కారణం అభిమానులు. ఎక్కడెక్కడినుంచో వచ్చిన మీకు ధన్యవాదాలు.

    నాలుగు సంవత్సరాల క్రితం కథ విన్నా..

    నాలుగు సంవత్సరాల క్రితం కథ విన్నా..

    ‘వినయ విదేయ రామ' ఈ మాట అనగానే మొదటగా నాకు గుర్తొచ్చేపేరు బోయపాటి శ్రీనుగారి పేరు. సంవత్సరం క్రితం కథ విని వెంటనే సినిమా చేద్దాం అని మొదలు పెట్టింది కాదు. నాలుగు సంవత్సరాల క్రితం కథ విన్నాను. ఆయన ఒక లైన్ చెప్పారు. నాతో పరిచయం ఉంది కదా ఇమ్మీడియేట్ గా సినిమా తీసేస్తారేమో అనుకున్నాను. నాతో ఏదో ప్లాన్ చేశారు. బోయపాటి అనేది బ్రాండ్ అని అందరికీ తెలుసు. ఆయన సినిమాలు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చూశాం. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చసే వ్యక్తి. అలాంటిది నాలుగు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఆలోచించి మన అభిమానులందరికీ నచ్చే ఒక సినిమా ఇవ్వాలని నాలుగు సంవత్సరాలు కథ మీద కూర్చుని, వెయిట్ చేసి, డిజైన్ చేసి రాసిన సబ్జెక్ట్ ‘వినయ విధేయ రామ'.

    ఆయనతో పని చేస్తే ఆ కిక్కే వేరప్పా...

    ఆయనతో పని చేస్తే ఆ కిక్కే వేరప్పా...

    దర్శకుడిగా కంటే వ్యక్తిగతంగా బోయపాటి గురించి చెప్పాలి. నేను పని చేసిన సినిమాల్లో మోస్ట్ డిసిప్లేన్డ్ ఎట్మాస్పియర్ ఒక బోయపాటి గారి సినిమాలోనే చూశాను. మా సినిమాతో పాటు ఆర్టిస్టులందరినీ చాలా చక్కగా చూసుకున్నారు. ప్రతి హీరో ఆయనతో ఒక్కసారైనా పని చేయాలనేది నా కోరిక. ఆయనతో పని చేస్తే ఆ కిక్కే వేరు. నేనొక కొత్త అవతారంలో కనిపిస్తానా? లేదా? అనేది తర్వాత. అవన్నీ సినిమా విడుదలైన తర్వాత టిక్కెట్ కొనేసి చూసుకుందాం. ఒక మంచి సినిమా మనం థియేటర్లో చూసినపుడు మనకు ఉన్న జోష్, ఆనందం ప్రతి రోజూ ఆయన సినిమాకు పని చేస్తున్నపుడు చూశాను. షాట్ పూర్తయిన తర్వాత మానిటర్ వద్ద చూసినపుడు అది నేనేనా? అని మరిచిపోయేలా చేశారు. అంత గొప్ప డైరెక్టర్ ఆయన. ఆయన మా ఇంట్లో నన్ను కలిసి వెళ్లిన తర్వాత మా అమ్మ, మా మిసెస్ అంటారు ఏంటి బోయపాటి గారిని కలిశావా? అని ఎందుకంటే నాలో తెలియని ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ సినిమా నాకు ఒక మొమోరీగా ఉంటుంది.

     నువ్వు ఎంత చాలెంజిగా కొట్టావో తెలియదు కానీ కొరియోగ్రాఫర్లు మాత్రం నా మెకాళ్లు ఇరగ్గొట్టారు

    నువ్వు ఎంత చాలెంజిగా కొట్టావో తెలియదు కానీ కొరియోగ్రాఫర్లు మాత్రం నా మెకాళ్లు ఇరగ్గొట్టారు

    దేవిశ్రీ ప్రసాద్ ఇన్ని సంవత్సరాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూ ఇంత క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం దేవి వల్లనే అవుతుంది. హాట్సాఫ్ టు దేవి. ఆయన మ్యూజిక్ ఒప్పుకున్నారంటే కచ్చిత్తంగా మన ఫ్యాన్స్, కుర్రోళ్లకు అమేజింగ్ మ్యూజిక్ ఉంటుంది. నువ్వు ఎంత చాలెంజిగా కొట్టావో తెలియదు కానీ కొరియోగ్రాఫర్లు మాత్రం నా మెకాళ్లు ఇరగ్గొట్టారు. ఇతర టెక్నీషియన్స్, అన్ని డిపార్టుమెంట్లకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.

     నాన్నగారిలా అన్నీ చేయాలని ఉంది

    నాన్నగారిలా అన్నీ చేయాలని ఉంది

    ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ బ్యూటిఫుల్ కమర్షియల్ సినిమా. నేను పెరిగిందే నాన్నగారి ఖైదీ, గ్యాంగ్ లీడర్ ఇవన్నీ చూసి పెరిగాం. అలాంటి ఒక లవ్లీ సినిమా. పేరొచ్చే సినిమాలు చేయాలి, అలరించే సినిమాలు చేయాలి. నాన్నగారు 80ల్లో అభిలాష, ఖైదీ, మంత్రిగారి వియ్యంకుడు అన్ని జోనర్స్ చేశారు. మేము కూడా అన్నీ జోనర్స్ చేయాలనే కోరిక ఉంది. అందరికీ న్యూ ఇయర్ శుభాకంక్షలు. ఫ్యామిలీ అందరినీ తీసుకుని సినిమాకు వెళ్లండి.

     బాబాయ్ సినిమాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్లారు

    బాబాయ్ సినిమాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్లారు

    ఈ మధ్య ఎవరు జ్యూస్, కాఫీలు తాగడం లేదు, అందరూ టీనే తాగుతున్నారు. చిన్న టీ గ్లాసు ఏదో గొప్ప పని చేస్తుందని ఆశిస్తున్నాను. మా బాబాయ్ సినిమాలు అన్నీ వదిలేసి ఒక పబ్లిక్ ఫ్లాట్ ఫాంకు వచ్చినపుడు, ఇంకొకరి కోసం యుద్ధం చేస్తూ...రోడ్ల మీదకు వెళ్లి, ఇంటింటికి వెళ్లి, జిల్లా జిల్లా తిరిగుతుంటే ఒక వైపు ఆనందంగా ఉంది, మరొక వైపు ఇంత కష్టపడుతుంటే కాస్త బాధగా కూడా ఉంది. మా కుటుంబ సభ్యుల బాధ కంటే ప్రజల బాధ తీర్చే ఒక వ్యక్తి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని రామ్ చరణ్ తెలిపారు.

    English summary
    Ram Charan Speech at Vinaya Vidheya Rama Pre Release Event. Vinaya Vidheya Rama is an upcoming Indian Telugu-language action film written and directed by Boyapati Srinu. The film features Ram Charan and Kiara Advani, who made her debut in Tollywood with Bharat Ane Nenu, in the lead roles. Vivek Oberoi stars as the antagonist in this film which also has Prashanth, Aryan Rajesh, Sneha and Ananya in pivotal roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X