»   » రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఖరారైంది

రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు మై నేమ్ ఈజ్ రాజు, బ్రూస్ లీ, విజేత, ఫైటర్, రీ సౌండ్ ఇలా అనేక టైటిల్స్ గతంలో పరిశీలించారు. అయితే ఇవేవీ ఓకే కాలేదు. ఫైనల్ గా ఈ చిత్రానికి ‘మెరుపు' అనే టైటిల్ ఓకే చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో టైటిల్ రామ్ చరణ్-ధరణి ప్రాజెక్టుకు పెడదామనుకున్నారు. అయితే ఓవర్ ప్రాజెక్టు కారణంగా ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇపుడు ఆ టైటిల్ మళ్లీ రామ్ చరణ్ సినిమాకే వస్తుండటం గమనార్హం. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటోంది.

Ram Charan and Sreenu Vaitla movie title confirmed

రామ్ చరణ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య డి.వి.వి. గత నెల 27 నుంచి బ్యాంకాక్ లో జరిగిన షూటింగ్ లో 'మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' నాయిక రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరించామని తెలిపారు. అలాగే టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ లో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలిపారు నిర్మాత దానయ్య.

విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ సమర్పణ : డి. పార్వతి నిర్మాత : దానయ్య డి.వి.వి. మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల.

English summary
Finally! Ram Charan and Sreenu Vaitla's flick has got a title after several considerations and a lot of confusion. According to the sources, the team has zeroed in on Merupu, which was supposed to be the title of Charan-Dharani project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu