»   » రామ్ చరణ్ - శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఏది ఫైనల్ చేస్తారు?

రామ్ చరణ్ - శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఏది ఫైనల్ చేస్తారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ ఖరారు కాలేదు. ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ గత కొంత కాలంగా ప్రచారంలో ఉంది. ‘బ్రూస్ లీ' అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇందులో ‘బ్రూస్ లీ' టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. ఇందులో రామ్ చరణ్ స్టంట్ మ్యాన్ గా నటిస్తున్న నేపథ్యంలో ఈ టైటిల్ ఖరారు చేసారట.

ఈ చిత్రంలో నాయికగా 'రకుల్ ప్రీత్ సింగ్' రాంచరణ్ సరసన తొలిసారిగా నటిస్తున్నారు. గత నెల 21 నుంచి 30 వరకు రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ల పై 'యూరప్' లో పాటల చిత్రీకరణ జరిగింది. జూన్ 3 నుంచి హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఇంకా పాటు కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, రావురమేష్, పవిత్రలోకేష్, సప్తగిరి, రవిప్రకాష్ ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

Ram Charan, Srinu Vaitla film title

డైరెక్టర్ 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ ‘ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నటీ,నట వర్గం: రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, నదియ, కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, ముఖేష్ రుషి, రావురమేష్, షాయాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజి, పృథ్వి, సప్తగిరి, కారుమంచి రఘు, రవిరాజ్, సత్య, రవిప్రకాష్, సురేఖావాణి, పవిత్రలోకేష్, కష్మీరష తదితరులు. ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం; తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, స్టంట్స్: అనల్ అరసు. లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ సమర్పణ : డి. పార్వతి నిర్మాత : దానయ్య డి.వి.వి. మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల.

English summary
The Hyderabad schedule of Ram Charan and Sreenu Vaitla's movie is in full swing currently. Rakul Preet Singh paired opposite Charan in this film. Titles like 'My Name Is Raju' and 'Bruce Lee' were considered for this film, but according to sources the makers have zeroed in on the title 'Bruce Lee' for this film as Charan plays a stuntman.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu