»   » రామ్ చరణ్‌ కాదు...శ్రీను వైట్ల వల్లే రూ. 7 కోట్లు!

రామ్ చరణ్‌ కాదు...శ్రీను వైట్ల వల్లే రూ. 7 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమా మొదలు కాకముందే ఓ డిస్ట్రిబ్యూటర్ రూ. 7 కోట్లు చెల్లించి ఓవర్సీస్ రైట్ష్ కొనుగోలు చేసాడట. వాస్తవానికి రామ్ చరణ్ మార్కెట్ విదేశాల్లో అంతలేదు. కేవలం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు ఆ రేంజిలో అమ్ముడయ్యాయి.

అయితే రామ్ చరణ్ మార్కెట్ విలువ అంత లేక పోయినా.....శ్రీను వైట్ల దర్శకత్వం, కోన వెంకట్, గోపీమోహన్ లాంటి వారు రచయితలుగా పని చేస్తుండటంతో ఇంత భారీ మొత్తం చెల్లించడానికి ముందుకొచ్చరట. అయితే ఇంత మొత్తం చెల్లించడానికి ముందుకు వచ్చింది పంపిణీ దారు ఎవరు అనే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

Ram Charan - Srinu Vytla

దూకుడు సినిమా తర్వాత విడిపోయి శ్రీను వైట్ల-కోన వెంకట్-గోపీ మోహన్... రామ్ చరణ్ సినిమా కోసం మళ్లీ కలిసి పని చేస్తుండటం వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ విషయమై గోపీ మోహన్ మాట్లాడుతూ...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శ్రీనువైట్ల డైరెక్షన్లో దానయ్య గారి బ్యానర్ లో త్వరలో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ కి కూడా మేము కధని అందిస్తున్నాం. పదేళ్ళు కలిసి పనిచేసిన మేము(వైట్ల గారు,కోన గారు,నేను), కొన్ని అనివార్య కారణాల వల్ల గత సంవత్సరం కలిసి పనిచెయ్యలేకపోయాం. దానికి కారణాలు

అనేకం. జరిగిన దానికి ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకునే సంస్కృతి నుండి బయటపడి, అందరి హీరోలతో జనరంజకమైన సినిమాలకి పనిచెయ్యాలని ఆశిస్తున్నాము. హీరో రామ్ చరణ్ ఉన్నత మనసుతో కోన గారిని, వైట్ల గారిని కలిపిన విధానం అభినందించదగినది. మా కలయికలో రాబోయే రామ్ చరణ్ నూతన చిత్రం చాలా మంచి కధతో, శ్రీను వైట్ల గారి సినిమాలకి భిన్నమైన కొత్త కధనంతో రూపకల్పన జరుగుతోంది. మా మార్కు మంచి హాస్యము ఉంటుంది. శ్రీను వైట్ల గారు, మా కాంబినేషన్ లో వచ్చిన

అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం గారి పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇదివరకు సినిమాల ఛాయలు ఎక్కడా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మార్చి 5న సినిమా ప్రారంభం కాబోతోంది. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికయింది. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా...తమిళ కుర్రోడు, కొలవెరి సాంగ్ ఫేం అనిరుద్ రవిచందర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన వై దిస్ కొలవెరి సాంగ్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. మరి రామ్ చరణ్ సినిమాకు అనిరుద్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

English summary
Ram Charan’s upcoming film in the direction of Srinu Vaitla tentatively titled My Name is Raju will be launched on 5th March, while the regular shooting schedules will commence from March 21 from Ugadi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu