»   » కావిడ మోస్తూ చరణ్, సుకుమార్ వదిలిన ప్రీ లుక్ అదిరింది (ఫొటో)

కావిడ మోస్తూ చరణ్, సుకుమార్ వదిలిన ప్రీ లుక్ అదిరింది (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా ధృవ వంటి సూపర్ హిట్ ని ఇచ్చిన రామ్ చరణ్ తన కొత్త చిత్రం మొదలెట్టేసారు. ఈ రోజు షూటింగ్ లాంఛనంగా మొదలెట్టి, ప్రీ లుక్ విడుదల చేసారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. ప్రీ రిలీజ్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా పచ్చి పల్లెటూరి వాతావరణంతో తెరకెక్కిస్తున్నారు. ఆ విషయాన్నినిజమే అని చెప్పటానికి అన్నట్లు.... చరణ్ కి సంబంధించిన ప్రీ లుక్ తో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేసారు సుకుమార్. ఓ పల్లె నేపధ్యంలో.. రెండు బిందెలను కావడిలో మోస్తున్న హీరో లుక్.. స్కెచ్ రూపంలో మనకు కనిపించంటం ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు.


నాన్నకు ప్రేమతో సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సుకుమార్ కరెక్టు గా సంవత్సరం తర్వాత... రాం చరణ్ కోసం ఓ పీరియాడిక్ లవ్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేశాడు. ఇది గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశమనేది టాలీవుడ్ వర్గాల సమాచారం. కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ కొనసాగుతుందనీ.. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపిస్తాడని సినీవర్గాలు అంటున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను సుకుమార్ సిద్ధం చేశాడని చెప్పుకుంటున్నారు.
Ram Charan and Sukumar's film Shoot Begins

ఇప్పటికే పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న సుక్కు, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, దసరా బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాంచరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

English summary
Ram Charan and director Sukumar's love story film under Mythri Movie Makers Shoot Begins.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu