For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ బెల్లం కలుపుకునే బాపతు: సుకుమార్

  By Bojja Kumar
  |

  సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం 'దర్శకుడు'. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించిన ఈచిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించారు. ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

  ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ...ద‌ర్శ‌కుడు అనే పేరు విన‌గానే గుర్తుకొచ్చే ఇద్దరి పేర్లు గుర్తొస్తాయి. అందులో ఒకటి ది గ్రేట్ లెజెండ్ దాస‌రి నారాయ‌ణ‌రావుగారైతే, రెండో పేరు రాఘ‌వేంద్ర‌రావుగారు. వీరిని చూసి ఇన్‌స్ఫైర్ కానీ ద‌ర్శ‌కుడెవ‌రు ఉండి ఉండ‌ర‌నుకుంటాను రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

  చాలా కొత్తగా ఉంది

  చాలా కొత్తగా ఉంది

  ద‌ర్శ‌కుడు అనే టైటిల్ పెట్ట‌డ‌మే కొత్త‌ద‌నం. దాని వ‌ల్ల వ‌చ్చే చాలెంజెస్ ఏంటో కూడా నాకు తెలుసు. సుకుమార్‌గారు నా అభిమాన ద‌ర్శ‌కుడు. త‌క్కువ రోజుల్లో నాకు చాలా దగ్గరైన వ్య‌క్తి సుకుమార్‌. సుకుమార్‌గారు త‌న పేరుపై ఓ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి కొత్త ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నందుకు త‌న‌ను అభినందిస్తున్నాను అన్నారు.

  ఆ కష్టం నాకు తెలుసు

  ఆ కష్టం నాకు తెలుసు

  దర్శకుడిగా, నిర్మాతగా సుకుమార్ మ‌ల్టీ టాలెంటెడ్‌గా అన్ని ప‌నులు చేస్తున్నాడు. నేను కూడా నాన్న‌గారి ఖైదీ నంబ‌ర్ 150తో నిర్మాత‌గా మారాను. అలాగే నాన్న‌గారి నెక్స్‌ట్ మూవీ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కూడా చేయ‌బోతున్నాను. ఓ ప్రొడ్యూస‌ర్‌కు ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. ఆ కష్టం నాకు తెలుసు. అంత క‌ష్టంలో ఉన్నా కూడా ద‌ర్శ‌కుడిగా త‌న వ‌ర్క్‌ను చేసుకుంటూ పోతున్నారు... అని రామ్ చరణ్ అన్నారు.

  రామ్ చరణ్ కాఫీలో బెల్లం కలుపుకునే బాపతు

  రామ్ చరణ్ కాఫీలో బెల్లం కలుపుకునే బాపతు

  సుకుమార్ మాట్లాడుతూ...నేను అడగ్గానే ఈ వేడుకకు వచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌కు చాలా పెద్ద థాంక్స్‌. రంగ‌స్థ‌లం 1985లో త‌న‌తో ఎలా సినిమా చేయాలని ఆలోచించాను. త‌ను చిరంజీవిగారి అబ్బాయిగా పుట్టి ఉండొచ్చు కానీ త‌ను మ‌ట్టి మ‌నిషి. కాఫీలో బెల్లం క‌లుపుకుని తాగే బాప‌తు. త‌ను హీరోస్ అంద‌రిలో చాలా నేచుర‌ల్‌. డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌ అని చెప్పుకొచ్చారు.

  దర్శకుడు టీం గురించి

  దర్శకుడు టీం గురించి

  మా డైరెక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్ ఫిజిక్స్ లెక్చ‌ర‌ర్‌. నాకు మంచి దోస్త్‌. నేను ఒకానొక స‌మ‌యంలో మాన‌సికంగా బ‌ల‌హీనంగా ఉన్న‌ప్పుడు నాకు అండ‌గా నిల‌బ‌డి ఎంతో స‌పోర్ట్ చేశారు. త‌ను ఈ క‌థ చెప్ప‌గానే త‌న‌నే డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌నకు ద‌ర్శ‌క‌త్వ అనుభ‌వం లేక‌పోయినా, ఈ సినిమాను ఓ అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడిలా ఎంతో బాగా చేశాడు. అశోక్‌ను హీరో చేయాల‌నే త‌ప‌న కూడా త‌న‌దే. ద‌ర్శ‌కుడు సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత త‌న‌ను అంద‌రూ ద‌ర్శ‌కుడు హ‌రిప్ర‌సాద్ అంటారు. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అని తెలిపారు.

  English summary
  RamCharan as Chief Guest for Darshakudu Movie Audio Launch. The movie Starring Ashok Bandreddi, Eesha Rebba, Pujita Ponnada. Directed by Hari Prasad Jakka and Produced by Sukumar, BNCSP Vijaya Kumar, Thomas Reddy Aduri, Ravichandra Satti, Music Composed by Sai Karthik.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X