»   » కుక్కతో రామ్ చరణ్ ఫన్నీగా....(ఫోటో)

కుక్కతో రామ్ చరణ్ ఫన్నీగా....(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా షూటింగులతో బిజీగా గడిపే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి రాగానే తన పెంపుడు కుక్క బ్రాట్‌ తో గడుపుతూ రిలాక్స్ అవుతున్నాడు. తాజాగా రామ్ చరణ్ బ్రాట్‍‌తో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో జలకాలాడుతున్న ఫోటోను సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసాడు.

బ్రాట్ అంటే రామ్ చరణ్ కు ఎంతో ఇష్టం. దాని కోసం శాఖాహారిగా మారారు. ఆయనకు ఆ కుక్కను ఉపాసన గిప్ట్ గా ఇచ్చిందట. ఆ కుక్క గురించి రామ్ చరణ్ గతంతో మాట్లాడుతూ..."నాకు నా వైఫ్ ఉపాసన నా పుట్టిన రోజు గిఫ్టుగా దీన్ని నాకు ఇచ్చింది' అని తెలిపారు.

'ఆ కుక్కను మొదటి సారి చూడగానే నాలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. నా భార్య ఏం పేరు పెడదాము అని అడిగిన వెంటనే వేరే ఆలోచన లేకుండా బ్రాట్ అని పెట్టాను. బ్రాట్ అనేది నా దగ్గర పెరిగిన అంతకు ముందు కుక్క పేరు. అది నా అజాగ్రత్త వల్ల నా చేతుల్లోనే చనిపోయింది. ఆ కుక్క నాతో 18 నెలలే ఉంది కానీ చాలా అనుబంధం పెంచుకుంది. అందుకే ఈ కుక్కకు ఆ పేరు పెట్టాను' అంటున్నాడు చరణ్.

రామ్ చరణ్ ఈ కుక్క పట్ల ఎంత ప్రేమను పెంచుకున్నారంటే...ఇటీవల ఆ కుక్క కాలుకు ప్యాక్చర్ అయితే...కాలులో రాడ్ వేసారు. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ....'దాని పెయిన్ చూస్తే చాలా బాధ వేసింది. త్వరగా అది కోలుకుని పరుగెత్తాలని కోరుకున్నా..అప్పటివరకూ నేను నాన్ వెజ్ ఫుడ్ వదిలేయాలనుకున్నాను. ఈ మధ్యనే దాని కాలులోంచి రాడ్ తీసేసారు. అది పూర్తిగా రికవరి అయ్యి పరుగెత్తాలని కోరుకుంటున్నా. అది బాగుండటం కోసం ఏదైనా చేస్తాను. " అని ఎమోషన్ ల్ గా చెప్పుకొచ్చారు.

ఇక రామ్‌చరణ్‌ తాజా సినిమా 'ఎవడు' విషయానికొస్తే... ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం మగధీర రేంజి హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

English summary
"My over smart brat teaching me how to swim... But he doesn't realise I support him. Haaha..." Ram Charan says about his dog.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu