»   » ఆ ఒక్క నిజంతో రామ్ చరణ్ ‘మెరుపు’ పై అభిమానుల కలలు...

ఆ ఒక్క నిజంతో రామ్ చరణ్ ‘మెరుపు’ పై అభిమానుల కలలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరెంజ్ సినిమా పూర్తి కాగానే తన తదుపరి చిత్రాన్ని 'మెరుపు" వేగంతో పూర్తి చేయాలని రామ్ చరణ్ డిసైడయ్యాడు. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ గేమ్ బ్యాక్ డ్రామ్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ ఫుట్ బాల్ ఎందుకు ఇండియాలో పాపులర్ కాలేదనే సంగతిని చెబుతుందని చరణ్ అంటున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన ఇద్దరు కథానాయికలునటిస్తారు. షూటింగ్ మొదలపెట్టగానే ఏకధాటిగా షూటింగ్ చేసి వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేస్తారు. నిజంగా ఫుట్ బాల్ ప్లేయర్ అనిపించడానికి చరణ్ ఈ చిత్రం కోసం ఇప్పట్నుంచే ఈ ఆటకి సంబంధించి శిక్షణ పొందుతున్నాడు. రోజుకి కనీసం నాలుగైదు గంటలు ఫుట్ బాల్ ఆటకే కేటాయిస్తున్నాడు. 'ఆరెంజ్" లో డిఫరెంట్ గెటప్ తో కనిపిపించిన చరణ్ 'మెరుపు"లో మరో కొత్త వేషధారణతో కనిపిస్తాడు. ఈ సినిమాపై ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ ధరణి గతంలో బంగారం సినిమా తీశాడనే ఒక్క నిజం మాత్రమే అభిమానులకి 'మెరుపు"కలలు తెప్పిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu