»   » నన్ను ఆ పేరుతో పిలవొద్దు...రామ్ చరణ్ రిక్వెస్ట్

నన్ను ఆ పేరుతో పిలవొద్దు...రామ్ చరణ్ రిక్వెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర' చిత్రం తర్వాత మళ్లీ రామ్‌చరణ్, కాజల్ జంటగా మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రైలి సంస్థ నిర్మించే 'మెరుపు' చిత్రం షూటింగ్ మొన్న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ..తన పేరులో 'తేజ్' పదం లేదని, తనని రామ్ ‌చరణ్ ‌గానే సంబోధించాలని తెలిపారు. తను జస్ట్ రామ్ చరణ్ అని, తేజ అనేది ఓ పెద్ద డైరక్టర్ పేరు అని, దానిని తనకు తగిలించవద్దని అన్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ చరణ్ సరసన కాజల్‌ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ధరణి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం డైరక్ట్ చేసారు. ఇక 'మెరుపు' చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫొట్రోఫీ: పిసి శ్రీరామ్, కళ: తోట తరణి, ఎడిటింగ్: విటి విజయన్, సమర్పణ: ఆర్ బి చౌదరి, నిర్మాతలు: ఎన్ వి ప్రసాద్, పారాస్ జైన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధరణి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu