»   » రామ్ చరణ్ ఆరంజ్ కధ గురించి ఫిలిం సిటి గుసగుసలు..

రామ్ చరణ్ ఆరంజ్ కధ గురించి ఫిలిం సిటి గుసగుసలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న సినిమా ఆరంజ్. ఎందుకంటే మొట్టమొదటసారి ఈసినిమాలో రామ్ చరణ్ తేజ్ లవర్ బాయ్ గాకనిపించనున్నారు. అంతేకాదండోయ్ ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి నాగబాబు నిర్మాతగా వ్యవహారించిన సినిమా. ఐతే మొదటినుంటి కూడా ఈసినిమా కోంచెం హైప్ నిసోంతం చేసుకుంది. దానికి కారణం ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆరెంజ్ పండుని వలిచినట్లుండేట్లుగా ముందుగా పోస్టర్లను తీర్చిదిద్దారు. అయితే అది బాగోలేదని మరలా వేరే లాగా లోగోని మార్చిన విషయం అందరికి తేలిసిందే.

ఇక ఈసినిమా కధ విషయానికి వచ్చేసరికి మొన్నటివరుకు ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు జరగడం, అక్కడ చాలా మంది వారి ప్రాణాలను కూడా కోల్పోడం తెలిసిందే. చదువు నిమిత్తం అక్కడికి వెళ్లినటువంటి రామ్ చరణ్ తేజ్ వాటిని ఏవిధంగా ఎదుర్కుంటాడనేదే ముఖ్యం సారాంశంగా ఈసినిమాలో సాగుతుందని సమాచారం. వీటన్నింటిని మీద కధగా అల్లి దర్శకుడు భాస్కర్, నిర్మాత నాగబాబు ముందుగా వినిపించి ఈకధ పవన్ కళ్యాణ్ ఐతే బాగా సరిపోతుందని ఆయనతో ఈచిత్రాన్ని చేయాలనిచెప్పడంతో ఆ కధ నాగబాబుకి నచ్చలేదు. అంతేకాకుండా ఖుషి తరహాలో ఉందని అనడం జరిగందంట. ఆ తర్వాత కథను కొద్దిగా మార్చి రామ్‌చరణ్‌కు చెప్పడం ఆకధ రామ్ చరణ్ ఓకె చెయ్యడం తో ఆరంజ్ సినిమా మొదలుపెట్టడం జరిగిందంట. ఇకపోతే ఈసినిమాలో హీరోయిన్ గాజెనిలియా నటించింది. ఈసినిమాని ఈనెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu