»   » ఆస్ట్రేలియా వార్తల్లో రామ్ చరణ్ 'ఆరెంజ్‌' ...

ఆస్ట్రేలియా వార్తల్లో రామ్ చరణ్ 'ఆరెంజ్‌' ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ, జెనీలియా కాంబినేషన్లో రెడీ అవుతున్న 'ఆరెంజ్‌' చిత్రం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా చిత్రీకరణ గత 14 వారాలుగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ పరిసరాల్లో సాగుతోంది. అయితే అక్కడ భారతీయులపై జరుగుతున్న దాడుల కారణంగా ఆస్ట్రేలియా వెళ్లడానికే అందరూ జంకుతున్న నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ అన్ని రోజుల పాటు అక్కడ జరుగుతుండటం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ విషయాలను ప్రస్దావిస్తూ...లైన్‌ ప్రొడ్యూసర్‌ (ఆస్ట్రేలియా) అనుపమ్‌ శర్మ వెల్లడిస్తూ "మెల్‌బోర్న్‌ భారతీయులకు సురక్షితం కాదనుకొంటున్న తరుణంలో ఓ చిత్రం ఇన్ని వారాలపాటు చిత్రీకరణ చేసుకోవడంపట్ల ఎంతో సంతోషించాము. ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం ఉందనే సందేశం భారతీయులకు ఈ సినిమా ద్వారా అందుతుందని ఆమె ఆశించారన్నారు.అలాగే ఆస్ట్రేలియా విద్యా శాఖామంత్రి బ్రొన్విన్‌ పైక్‌ ఇటీవల 'ఆరెంజ్‌' చిత్రీకరణ జరుగుతున్న సెట్‌కి వెళ్లి సందర్శించారు. ఆ విషయం అక్కడ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె.నాగేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రభు, సుమన్, ప్రగతి, కిషోర్, ప్రణతి తదితరులు ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, సంగీతం: హేరిస్ జైరాజ్, ఫొటోగ్రఫీ: కిరణ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మన్యం రమేష్, నిర్మాత: కె.నాగేంద్రబాబు, దర్శకత్వం: 'బొమ్మరిల్లు' భాస్కర్

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu