»   » త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్..!!

త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్..!!

Subscribe to Filmibeat Telugu

ఒకరు తను నటించిన రెండవ సినిమాతోనే 75 ఏళ్ల తెలుగు సినీచరిత్రలోని అన్ని రికార్డులనూ బద్దలుకొట్టేసిన 'మగధీరు'డు, మరొకరు తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని 'అతడి'తో సినిమాలు చేసి 'జల్సా' చేసుకోవాలని హీరోలందరూ ఎదురుచూసే దర్శకుడు. వారే రామ్ చరణ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి కాంబినేషన్ ఎలా వుంటుంది..?? అది వేరే చెప్పాలా అధిరిపోద్ది, కేక, భీభత్సంగా వుంటుంది.... ఇలా చెప్పడానికి మాటలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా మీకు.. వీరి కాంబినేషన్ లో సినిమా రూపొందితే ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో తెలీదు కానీ ప్రస్తుతానికి వీరిద్దరూ ఓ వాణిజ్య ప్రకటన కోసం కలసి పనిచెయ్యనున్నారు.

పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఈ సంస్థకు చెందిన ఓ ప్రకటనలో నటించనున్నాడు. ఈ ప్రకటనకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే నెలలో ముంబైలో ఈ ప్రకటన షూటింగ్ జరుగనుందని సమాచారం. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సినిమా కూడా ఎంతో దూరంలో లేదని, రామ్ చరణ్ కూడా తన బాబాయ్ పవన్ కళ్యాన్ లాగే త్రివిక్రమ్ తో జల్సా చేసుకోవడానికి ఆశక్తి చూపుతున్నారని పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ సినిమా కానీ మొదలైతే మెగాస్టార్ అభిమానులకు పండగే... ఏమంటారు..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu