»   » ‘కంచె’ ఆడియో రిలీజ్ చీఫ్ గెస్ట్ ఖరారయ్యాడు!

‘కంచె’ ఆడియో రిలీజ్ చీఫ్ గెస్ట్ ఖరారయ్యాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ త్వరలో ‘కంచె' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 2న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 17న మెగా అభిమానుల మధ్య గ్రాండ్ గా ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు చీఫ్ గెస్టు ఖరయ్యాడు. తొలుత మెగాస్టార్ చిరంజీవిగానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గానీ వస్తారని ఆశించారు. కానీ రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా ఖరారయ్యాడు. హైదరాబాద్ లోనే ఆడియో వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

‘కంచె' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రానుంది . అలాగే...స్వాతంత్రానికి ముందు జరిగే కథతో రూపొందే ఈ చిత్రం విడుదల తేదీని ...కూడా దేశభక్తికి చెందిన తేదీనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తేదీ మరేదో కాదు....అక్టోబర్ 2, అంటే గాంధీ జయింతి రోజున ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ వారికి, జమీందార్ వ్యవస్దకు వ్యతిరేకంగా సాగే పోరాటంతో ఈ చిత్రం కథ సాగనుంది.


Ram Charan to launch Kanche audio

ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ..సైనికుడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. 1910 వ సంవత్సరంలో కథ జరుగుతుంది. వరుణ్ తేజలోని నటుణ్ణి క్రిష్ 'కంచె' చిత్రంలో వెలికి తెచ్చాడని యూనిట్ సభ్యులు అంటున్నారు... ఈ సినిమాతో వరుణ్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనీ చెబుతున్నారు.


Ram Charan to launch Kanche audio

ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిచింది. కంచె చిత్రంలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు.

English summary
Mega hero Varun Tej’s upcoming film Kanche is gearing up to hit the screens on the 2nd of October. The audio will be launched on 17th September in Hyderabad and Mega Power Star Ram Charan will be the special chief guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu