»   » దీపావళి రోజు రామ్ చరణ్ ఏం చేసాడో చూస్తే ఆశ్చర్యపోతారు (వీడియో)

దీపావళి రోజు రామ్ చరణ్ ఏం చేసాడో చూస్తే ఆశ్చర్యపోతారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అవును..దీపావళి రోజు అందరూ ఏం చేస్తారు...టపాసులు, మతాబులు వగైరా దీపావళి క్రాకర్స్ కాల్చుకుంటారు..ఫ్రెండ్స్ తో,కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కానీ రామ్ చరణ్ మాత్రం తన తాజా చిత్రం ధృవ సాంగ్ షూటింగ్ సంభందించిన పనిలో బిజీగా ఉన్నారు.
అందుకోసం ఆయన ఇదిగో దీపావళి రోజు ఇలా కష్టపడ్డారు. ధృవ టైటిల్ సాంగ్ కోసం ఆయన తన కండరాలను ఇనుములా చేస్తున్నారు. ఈ వీడియోని రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.


మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ్.. ఈ మూవీలో రామ్ మ‌రింత గ్లామ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు.. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్, టీజర్స్ లో హ్యాండ్ స‌మ్ గా క‌నిపిస్తూ దుమ్ము రేపుతున్నారు. అయితే .. ఇలా క‌నిపించేందుకు ప్రతి రోజూ జిమ్ లో ప్ర‌త్యేక వ‌ర్కౌట్ చేస్తున్నాడు.


కొద్ది రోజుల క్రితం భార్య ఉప‌సన‌తో క‌ల‌సి చేస్తున్న వ‌ర్కౌట్ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.. ఇప్ప‌టికే ఈ వీడియోను ల‌క్ష‌ల్లో తిల‌కించారు.. ఇన్నీ వ్యూలు రావ‌డం రామ్ చ‌ర‌ణ్ కు ఉన్న క్రేజ్ కు అద్దంప‌డుతుంది. ఇది ఇలా ఉంటే ధృవ్ టాకీ పార్ట్ పూర్తి అయ్యి..సాంగ్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మేము తరుచేయాలనే...

మేము తరుచేయాలనే...


‘జంటగా వ్యాయామం చేయడమంటే నాకిష్టం. ఇప్పుడు మిస్టర్‌ సి(చరణ్‌) గోల్స్‌ను సెట్‌ చేస్తారు, మేము తరచూ దీన్ని చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాను' అని ఉపాసన ట్వీట్‌ చేశారు. ధృవ గురించే

ధృవ గురించే


రామ్‌చరణ్‌ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ధృవ' చిత్రం నటిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన 'తనీఒరువన్‌' రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. అరవిందస్వామి కీలక పాత్ర పోషిస్తున్నారు. ధృవ దుమ్ము దులిపి

ధృవ దుమ్ము దులిపి

విజయదశమి సందర్భంగా 'ధృవ' టీజర్‌ను విడుదల చేసారు. 'నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే.. నీ క్యారెక్టర్‌ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే.. నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువును సెలెక్ట్‌ చేసుకున్నాను' అంటూ వచ్చిన ఈ టీజర్ దుమ్ము దులిపింది. దాంతో ఈ సినిమాపై క్రేజ్‌ రెట్టింపు అయ్యింది. అవే టీజర్ కు ప్లస్ అయ్యాయి

అవే టీజర్ కు ప్లస్ అయ్యాయి


యూట్యూబ్‌లో విడుదలైనప్పట్నుంచే దూసుకుపోతోన్న ఈ టీజర్ ఇప్పటికే 3 మిలియన్ మార్క్ కూడా దాటేసి ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తూ వెళుతోంది. రామ్ చరణ్ ఓ స్టైలిష్ పోలీసాఫీసర్‌గా అదిరిపోయే లుక్‌తో కనిపించడం, దర్శకుడు సురేందర్ రెడ్డి మార్క్ మేకింగ్, టీజర్ కట్ అన్నీ కలిపి టీజర్‌కు ఒక స్థాయిని తెచ్చిపెట్టాయి. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది.దుమ్ము రేపిన టీజర్ ఇదే


ఇప్పటికే మీరు టీజర్ చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ఇప్పుడికే చూసేస్తే మరో సారి చూడండి. ఇందులో రామ్ చరణ్ ని సురేంద్రరెడ్డి ఓ రేంజిలో చూపెట్టారని మీరే ఒప్పుకుంటారు. సుకుమార్ తో కూడా

సుకుమార్ తో కూడా


మరో ప్రక్క సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రానికి సంబంధించిన పనులు షురూ అయినట్టు తెలిసింది. ఈ నెలలోనే చిత్రానికి కొబ్బరికాయ కొట్టబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రం పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కబోతోంది. ఓ కొత్త బ్యాక్ డ్రాప్

ఓ కొత్త బ్యాక్ డ్రాప్


సుకుమార్ తో చేసే కథలో సైంటిఫిక్‌ అంశాలు కూడా ఉంటాయట. సుకుమార్‌ మార్క్‌ అంశాలతో పాటు, ఓ కొత్త నేపథ్యం సినిమాలో కనిపించబో తోందని సమాచారం. హీరోయిన్స్ గా నిత్యమేనన్‌, నివేదాథామస్‌ నటించే అవకాశాలున్నాయని తెలిసింది.


 వర్కవుట్స్ తో పాటు

వర్కవుట్స్ తో పాటు


ధృవ సినిమాలో చెర్రీది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్. ఇప్పటికే ఫిట్ గా ఉన్నా, ఆ పాత్రకోసం ఇంకా బరువు తగ్గాలని రామ్ చరణ్ భావించాడట. అందుకే గంటల తరబడి జిమ్ వర్కవుట్లతో పాటు, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటివి చేస్తూ కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం.
English summary
On the Diwali day, for the title song of 'Dhruva', the Ramcharan is working out to tone up his body. "This is what Mr. Charan is doing on Diwali! All set for his title song. #Dhruva #RamCharan," Upasana tweeted with a video of her hubby sacrificing fun for hard work. Charan too posted a similar message. "Diwali eve killing it in the gym with my trainer #Rakeshudiyar. Getting ready to shoot the title song of Dhruva from the 2nd of Nov.#Stayinspired #HappyDiwali."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu