»   » ఉపాసన ఫేస్ లో పట్టలేని ఆనందం తీసుకొచ్చాడు చెర్రీ, ఆ క్షణాలు ఇవే.. (ఫొటోలు)

ఉపాసన ఫేస్ లో పట్టలేని ఆనందం తీసుకొచ్చాడు చెర్రీ, ఆ క్షణాలు ఇవే.. (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్ చరణ్ ఎన్నడూ లేని విధంగా తన తాజా చిత్రం ధృవ చిత్రం ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. మొన్నటి దాకా అమెరికాలో ఓ రేంజిలో ప్రమేషన్ చేసి వచ్చిన రామ్ చరణ్ నిన్నే ఇండియాకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ తన భార్య ఉపాసన తో కలిసి హైదరాబాద్ లో ధృవ ని చూసారు. ఆ ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ధృవ' 9వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఒకవైఫు కరెన్సీ బ్యాన్ ప్రభావం తీవ్రంగా నడుస్తున్నా కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లనే రాబట్టింది.


ముఖ్యంగా ఏపీ, తెలంగాణాల్లో మెగా అభిమానులు, సినీ అభిమానులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. చరణ్ సిక్స్ ప్యాక్ లుక్, అద్భుతమైన పోలీస్ స్టోరీ లైన్, సురేందర్ రెడ్డి రిచ్ మేకింగ్, రామ్ చరణ్, అరవింద స్వామిల నటన వంటివి ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.


ఇంటర్వూలు ఇస్తూ..

ఇంటర్వూలు ఇస్తూ..

ధృవ రిలీజ్ కి రెండు రోజుల ముందే బయల్దేరి అమెరికా వెళ్లిపోయాడు రామ్ చరణ్. ముందు రోజు యూఎస్ లో ప్రీమియర్స్ దగ్గర నుంచి.. సండే వరకూ అక్కడే గడిపాడు. తిరిగి బుధవారం ఉదయానికి ఇండియా వచ్చిన చెర్రీ ఇక్కడ రేడియో ఇంటర్వ్యూలు ఇస్తూ టైం స్పెండ్ చేశాడు.


మొదటి నుంచి ఉపాసనే..

మొదటి నుంచి ఉపాసనే..

మరి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న తన లేటెస్ట్ మూవీ ధృవను.. తన బెటర్ హాఫ్ అయిన ఉపాసనకు చూపించాలి అని ఫిక్స్ అయ్యారు. ధృవ మూవీ షూటింగ్ లోను.. అటు ఖైదీ నెంబర్ 150షూటింగ్ జరిగే సమయంలోను.. ఉపాసన సెట్స్ లో గడిపింది. ఆ ఫోటోలు కూడా మనం చూసాం.


అభిమానుల మధ్య

అభిమానుల మధ్య

సూపర్ హిట్ టాక్ వచ్చిన తన భర్త హీరోగా చేసిన సినిమాని థియేటర్లో.. అది కూడా భర్తతో కలిసి అభిమానుల మధ్య కలిసి చూస్తే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది కదా. అందుకే చెర్రీ అండ్ ఉపాసనలు కలిసి ఇప్పుడు ధృవ మూవీని హైద్రాబాద్ లో ఐనాక్స్ లో చూసేశారు.


ఓ రేంజిలో ..

ఓ రేంజిలో ..

సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఇద్దరి మొహాల్లోనూ.. ముఖ్యంగా చెర్రీ వైఫ్ ఉపాసన ఫేస్ లో గ్లో అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆమె ముఖం.. వంద కాండిల్స్ బల్బ్ లను ఓ వంద ఒకేసారి వెలిగించిన రేంజ్ లో కళకళలాడిపోయింది. మొత్తానికి భర్తతో కలిసి ధృవ మూవీని ఉపాసన బాగానే ఎంజాయ్ చేసింది.


నిన్న చెర్రీ ఫేస్

నిన్న చెర్రీ ఫేస్

నిన్న ఉదయం రామ్ చరణ్ కి ఫేస్ కూడా అలాగే వెలిగిపోయింది. యన అమెరికా నుంచి వస్తూ ..షంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి అడుగుపెట్టగానే అభిమానులు ఆయనకోసం ఎదురుచూస్తూ కనపడటం. అబిమానులు ఆయన్ను చుట్టి ముట్టి అభినందనలతో ముంచెత్తారు. ఇది రామ్ చరణ్ ఊహించని సంఘటన. దీంతోనే ధృవ రేంజి సక్సెస్ ఏంటో ఆయనకు అర్దమైంది.


అమెరికా ధియోటర్స్ లో ..

అమెరికా ధియోటర్స్ లో ..

రామ్ చరణ్ న చాలా కాలం నుంచి ఓవర్ సీస్ లో రికార్డ్ వసూళ్లు కోసం ఎదురుచూస్తున్నారు. చిన్న చిన్న హీరోలు సైతం ఓవర్ సీస్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తూండగా...చరణ్ మాత్రం వెనకబడి పోయాడు. ఈ నేపధ్యంలో ఈసారి ఆయన ధృష్టి మొత్తం ఓవర్ సీస్ పై పెట్టారు. సినిమా రిలీజ్ సమాయానికి అమెరికా వెళ్లారు. రామ్ చ‌ర‌ణ్ తేజ్ త‌న తాజా చిత్రం ధృవ చిత్రం ప్రీమియ‌ర్ షో చూసేందుకు అమెరికాలో అడుగుపెట్టి అక్కడ పబ్లిసిటీ కాంపైన్ చేసారు. అమెరికాలోని ప‌లు న‌గ‌రాల్లో జ‌ర‌గ‌నున్న ధృవ ప్రీమియ‌ర్ షోల‌ను అత‌డు అక్క‌డి త‌న అభిమానుల‌తో క‌లిసి చూసాడు.


 స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది

స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది

తన సినిమాలకు ఇక్కడ మంచి కలెక్షన్లే వస్తున్నా ఓవర్సీస్ మార్కెట్ బాగాలేకపోవడం చరణ్ గమనించాడు. అందుకేనేమో సినిమా ప్రీమియర్ షో దగ్గర నుంచి అమెరికాలోనే ఉండి పలు థియేటర్లలో వరుసగా సినిమాలు చూస్తూ ఓవర్సీస్ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. దాంతో ఈ స్టాటజీ వర్కవుట్ అయ్యింది. ధృవ చిత్రానికి ఇంతకు ముందు రామ్ చరణ్ ఏ చిత్రానికి రానంత రెస్పాన్స్ యుఎస్ లో వచ్చింది. దాంతో ఆయన ఉత్సాహంగా ఇండియాలో అడుగుపెట్టారు.


English summary
Ram Charan and Upasana Watched Dhruva Movie Inox theatre, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu